Vijayawada: బీసీలకు సామాజిక న్యాయం ఎక్కడ?: శీరం నాగమల్లేశ్వరరావు!
Vijayawada: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ పదవిని బీసీలకు కేటాయించకపోవడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ అధ్యక్షులు శీరం నాగమల్లేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Vijayawada: బీసీలకు సామాజిక న్యాయం ఎక్కడ?: శీరం నాగమల్లేశ్వరరావు!
విజయవాడ: విజయవాడ మేయర్ పదవి ఓసీ వర్గానికి కేటాయించిన నేపథ్యంలో, కనీసం డిప్యూటీ మేయర్ పదవినైనా బీసీలకు కేటాయిస్తారని ఆశించిన బీసీ వర్గాలకు నిరాశ ఎదురైంది. విజయవాడ నగర అభివృద్ధిలోనూ, ప్రజాస్వామ్య ప్రక్రియలోనూ బీసీల పాత్ర ఎంతో కీలకం. అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య బాధ్యత. బీసీలకు కేవలం ఓట్లు వేసే వర్గంగా కాకుండా, పాలనలో భాగస్వాములుగా గుర్తింపు ఇవ్వాలి. జనాభా, రాజకీయ బలం, సామాజిక న్యాయం ఆధారంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
మా ప్రశ్న ఒక్కటే:
బీసీల ఓట్లు కావాలి.. కానీ బీసీలకు పదవులు ఎందుకు దక్కడం లేదు?
బీసీలకు రాజకీయ అధికారంలో సముచిత భాగస్వామ్యం ఎప్పుడు?
సామాజిక న్యాయం మాటల్లోనేనా? ఆచరణలో ఎప్పుడు?
బీసీలకు న్యాయం జరిగే వరకు మా గొంతు వినిపిస్తూనే ఉంటుంది. ఇట్లు, శీరం. నాగమల్లేశ్వరరావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ అధ్యక్షులు.




