Vijayawada: గాళ్ళ సుబ్రహ్మణ్యం హఠాన్మరణం కాపు కులానికి తీరని లోటు
Vijayawada: కాపు నేత గాళ్ళ సుబ్రహ్మణ్యం హఠాన్మరణం పట్ల కాపు జేఏసీ సంతాపం. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని డిమాండ్.
Vijayawada: గాళ్ళ సుబ్రహ్మణ్యం హఠాన్మరణం కాపు కులానికి తీరని లోటు
విజయవాడ: గాళ్ళ సుబ్రహ్మణ్యం హఠాన్మరణం కాపు కులానికి తీరని లోటు అని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్ధన్ తెలిపారు.బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుటుంబం కన్నా కులమే మిన్న అంటూ గత ఐదు దశాబ్దాలుగా కాపు,కాపు ఉప సంఘాల కోసం పోరాడినటువంటి గొప్ప నాయకుడు అని కాపులకు ఆయన లోటు తీర్చలేనిదని రంగా గారి ఆశయ సాధన కోసం, కాపుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి గాళ్ళ సుబ్రహ్మణ్యం అని అన్నారు.
ఆయన మరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని కాపు జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నామని , నేడు ఆయన అంతిమయాత్రలో మాజీ మంత్రులు,మాజీ శాసనసభ్యులు పాల్గొంటున్నారని, అలాగే రాష్ట్రంలో ఉన్న కాపులంతా కూడా పార్టీలకతీతంగా అంతిమ యాత్రలో పాల్గొని ఆయనకి ప్రగాఢ సానుభూతులు పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ఆర్జా రామకృష్ణ, కాపు తెలగ బలిజ జేఏసీ అధ్యక్షులు దాసరి రాము,
కాపునాడు సిటీ అధ్యక్షులు పరుచూరి కరుణాకర్, రాష్ట్ర మహిళా అధ్యక్షులు పగడాల లక్ష్మీ ప్రసన్న, మరియు కాపు నాయకులు కూర్మ మిల్ల ఈశ్వర్, రవి కిరణ్ ,కోటిపల్లి రామారావు, ఆకుల తిరుమలరావు, మెండు చక్రధర్, మహిళా నాయకులు సామ్రాజ్యం, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




