Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు 38.700 గ్రాముల బంగారు హారం కానుక!

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి ముంబై భక్తుడు జి.వి. వంశీకృష్ణ 38.700 గ్రాముల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు.

Satyanarayana, Vijayawada
Published on: 13 Nov 2026 3:41 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు 38.700 గ్రాముల బంగారు హారం కానుక!

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తులు తమ భక్తిశ్రద్ధలతో బంగారు కానుకను సమర్పించారు. ముంబై (చెంబూరు) ప్రాంతానికి చెందిన భక్తులు శ్రీ జి.వి. వంశీకృష్ణ (G.V. Vamsi Krishna) గారు శుక్రవారం (13.11.2026) అమ్మవారికి కానుకగా 38.700 గ్రాముల (ముప్పై ఎనిమిది గ్రాముల ఏడు వందల మిల్లీగ్రాములు) బరువు గల బంగారు హారం (1) ను సమర్పించారు.

ఈ బంగారు హారాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (E.O) శ్రీ సీనా నాయక్ గారికి అందజేయగా, ఆలయ అధికారులు దానికి సంబంధించిన అధికారిక రసీదును దాతకు అందజేశారు. అనంతరం దాతకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసి, వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు అమ్మవారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada