Vijayawada: ప్రచారంలో భాగంగా ఆకట్టుకున్న ఫ్లాష్‌మాబ్‌లు

Vijayawada: విజయవాడ ఉత్సవ్ ప్రచారంలో భాగంగా ప్రధాన కూడళ్లలో ఫ్లాష్‌మాబ్‌లు నిర్వహించారు. కళాకారుల నృత్య ప్రదర్శనలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 3 Oct 2026 8:41 PM IST
Vijayawada
X

Vijayawada: ప్రచారంలో భాగంగా ఆకట్టుకున్న ఫ్లాష్‌మాబ్‌లు

విజయవాడ: విజయవాడ(పశ్చిమ నియోజకవర్గం)సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యాటక శాఖ సహకారంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్కు విస్తృత ప్రచారం కల్పించేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని చిట్టినగర్ సెంటర్, భవానిపురం శివాలయం సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్, కలరా హాస్పిటల్ సెంటర్ వద్ద ప్రత్యేకంగా ఫ్లాష్‌మాబ్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.ప్రధాన కూడళ్లలో ఒక్కసారిగా సంగీతం ప్రారంభం కావడంతో యువ కళాకారులు ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలను ప్రారంభించారు. సమన్వయంతో కూడిన నృత్య కదలికలు, ఆకట్టుకునే కొరియోగ్రఫీతో కళాకారులు చేసిన ప్రదర్శనలు స్థానికులు, ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో ప్రదర్శనలను చిత్రీకరిస్తూ ఆసక్తిగా తిలకించారు.

ఫ్లాష్‌మాబ్‌లలో విజయవాడ నగర కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే అంశాలతో పాటు విజయవాడ ఉత్సవ్ స్ఫూర్తిని చాటిచెప్పే నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువతలో ఉత్సవంపై ఆసక్తిని పెంచడంతో పాటు, నగరవాసులను విజయవాడ ఉత్సవ్‌లో భాగస్వాములను చేయడం, ఉత్సవ విశేషాలను వినూత్న రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

చిట్టినగర్, భవానిపురం, కాళేశ్వరరావు మార్కెట్, కలరా హాస్పిటల్ సెంటర్లలో నిర్వహించిన ఫ్లాష్‌మాబ్‌లు విజయవాడ ఉత్సవ్ సందేశాన్ని నేరుగా ప్రజల మధ్యకు తీసుకెళ్లాయి. సంప్రదాయ ప్రచార విధానాలకు భిన్నంగా సంగీతం, నృత్యం, యువత ఉత్సాహంతో నిర్వహించిన ఈ కార్యక్రమాలు నగరంలో ఉత్సవ వాతావరణాన్ని మరింత పెంచాయి.

విజయవాడ నగరానికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రత్యేకతలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, విజయవాడ ఉత్సవ్‌ను నగర ప్రజలందరి ఉత్సవంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఇటువంటి వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.విజయవాడ ప్రజలు, కళాకారులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో ఫతావుల్లా, ఆషా, ఏదుపాటి రామయ్య గుర్రంకొండ పాల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.