Vijayawada: విజయవాడలో భవానీల రద్దీ డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ
Vijayawada: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి భవానీ దీక్షాధారుల తాకిడి. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీసీపీ షరీనా బేగం చర్యలు.
Vijayawada: విజయవాడలో భవానీల రద్దీ డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ
విజయవాడ: విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భవానీ దీక్షాధారులు బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో తరలివస్తున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు
పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీనా బేగం, పర్యవేక్షణలో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ, వాహనాల రాకపోకల పర్యవేక్షణకు అవసరమైన కార్యాచరణ
డ్రోన్ల ద్వారా రద్దీపై నిరంతర పర్యవేక్షణ
ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం, ప్రధాన రహదారులు, కూడళ్లు, బస్సుల రాకపోకలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అనుమతులకు అనుగుణంగా డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షించి, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించేలా చర్యలు తీసుకుంటారు. తద్వారా సంబంధిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తం చేసి, అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టేందుకు వీలవుతుంది.
పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపులకు ప్రాధాన్యత
ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం
భవానీ దీక్షాధారులను తీసుకువచ్చే బస్సులు నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకుంటారు. ప్రధాన రహదారులపై బస్సుల నిలుపుదల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పర్యవేక్షిస్తారు. పార్కింగ్ ప్రాంతాల్లో రద్దీ పెరిగినప్పుడు ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాలకు వాహనాలను మళ్లించేలా సమన్వయం చేస్తారు.
ప్రజలకు, భక్తులకు విజ్ఞప్తి
భక్తులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని, తమ వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలని, రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు.
భక్తుల సౌకర్యం, ప్రజల భద్రత, సాఫీగా వాహనాల రాకపోకలే లక్ష్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు కృషి చేస్తున్నారు.




