Vijayawada: దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌కు ప్రముఖుల ఆహ్వానం
Vijayawada: విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, కేంద్ర మంత్రులను ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానించారు.
Vijayawada: దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌కు ప్రముఖుల ఆహ్వానం
విజయవాడ: ( ఢిల్లీ / చెన్నై)విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు జాతీయ స్థాయి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ను విజయవాడ ఉత్సవ్ ప్రతినిధి బృందం కలిసి ఉత్సవాలకు ప్రత్యేకంగా ఆహ్వానించింది.
ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జీఎం హరీష్ బాలయోగితో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్‌ను కలిశారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు పొందడంతో పాటు, విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వారసత్వ వైభవాన్ని ఆస్వాదించాలని సీఎం విజయ్‌ను ఆహ్వానించారు. అలాగే విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనాలని కోరారు.
అదేవిధంగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషీలకు కూడా విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు ఆహ్వాన పత్రికలను అందజేశారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపీ జీఎం హరీష్ బాలయోగి, విజయవాడ ఉత్సవ్ కమిటీ ప్రతినిధి నరసింహారావు కేంద్ర మంత్రులను కలిసి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.
విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0 ద్వారా నగరంలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా, చారిత్రక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. వివిధ రాష్ట్రాల ప్రముఖులు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవ్ 2.0కు మరింత జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు పొందేందుకు, విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించేందుకు తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్‌తో పాటు కేంద్ర మంత్రులు విజయవాడకు విచ్చేసి ఉత్సవాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.




