Vijayawada: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయాలి: కాంగ్రెస్ ధర్నా
Vijayawada: ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని విజయవాడ ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది.
Vijayawada: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయాలి: కాంగ్రెస్ ధర్నా
విజయవాడ: ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు లభించిన ఓటు హక్కును కాపాడాలని, S.I.R. ప్రక్రియ ద్వారా ఓట్ల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగాల్సి ఉండగా, S.I.R. పేరుతో లక్షలాది ఓట్లు తొలగించే చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. S.I.R. ప్రక్రియ పేరుతో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటు ప్రజల ప్రాథమిక హక్కు అని, ఎలాంటి చర్యల ద్వారా ఆ హక్కుకు భంగం కలిగించకూడదని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త నరసయ్య, కార్యదర్శి ఇళయరాజా, గోపి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీను గౌడ్, జిల్లా పరిపాలన కమిటీ చైర్మన్ రత్నం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, స్పోర్ట్స్ సెల్ చైర్మన్ బాబు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వినోద్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, నాగలాపురం మండల అధ్యక్షులు షణ్ముగం, సూళ్లూరుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శ్వేత, దొరవారిసత్రం మండల మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




