Pendurthi: ఉపాధ్యాయులపై వైసిపి కార్యకర్తల దాడి అమానుషం!
Pendurthi: విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైసిపి కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించిన ఏపీ గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు.
Pendurthi: ఉపాధ్యాయులపై వైసిపి కార్యకర్తల దాడి అమానుషం!
Pendurthi: మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో నియమితులైన ఉపాధ్యాయులపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరమని ఏపీ గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వర రావు అన్నారు. విజయవాడలో సోమవారం క్రీడల మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం పెందుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
ఏళ్ల తరబడి కష్టపడి క్రీడల్లో ప్రతిభ కనబరిచి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం సరికాదన్నారు. గురువులను దేవుళ్లుగా భావించే సమాజంలో వారిపై దాడులకు పాల్పడటం విచారకరమని పేర్కొన్నారు.
ఎంతో కష్టపడి నిబంధనల ప్రకారం ఉద్యోగాలు సాధించిన వారిని తప్పుడు ఆరోపణలతో అవమానించడం సరికాదన్నారు. వైసీపీ నేతలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి, న్యాయపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించారు.
ఉపాధ్యాయులపై దాడులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు రక్షణ కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పరమేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.




