Kaligiri: మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిగిన టీడీపీ నేతలు!

Kaligiri: విజయవాడలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్రను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గంజాం రాఘవేంద్ర ఆధ్వర్యంలో కలిగిరి మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

V. Kamaiah, Vinjamuru
Published on: 5 Oct 2026 6:02 PM IST
Kaligiri
X

Kaligiri: మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిగిన టీడీపీ నేతలు!

Kaligiri: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైన్స్, జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను టీడీపీ నాయకులు విజయవాడలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, దర్శి నియోజకవర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర ఆధ్వర్యంలో కలిగిరి మండల కన్వీనర్ పూసల వెంగప నాయుడు, ఏపినాపి మాజీ సర్పంచ్ వరప్రసాద్, శ్రీధర్ తదితరులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్రతో నాయకులు పలు అంశాలపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలు, స్థానికంగా నెలకొన్న వివిధ సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్రను నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru