Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా శ్రీ మహాలక్ష్మి యాగం.. ఘనంగా పూర్ణాహుతి!

Indrakeeladri: ధన త్రయోదశి పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత యాగశాలలో శ్రీ మహాలక్ష్మి యాగం శాస్త్రోక్తంగా జరిగింది.

Satyanarayana, Vijayawada
Published on: 7 Nov 2026 4:59 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా శ్రీ మహాలక్ష్మి యాగం.. ఘనంగా పూర్ణాహుతి!

ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ధన త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం పాత యాగశాలలో శాస్త్రోక్తంగా "శ్రీ మహాలక్ష్మి యాగం" అత్యంత వైభవంగా నిర్వహించబడింది. లోక క్షేమాన్ని, సర్వజనుల ఆయురారోగ్య ఐశ్వర్యాలను కాంక్షిస్తూ దేవస్థానం తరఫున నిర్వహించిన ఈ విశేష యాగ క్రతువు ఆలయ స్థానాచార్యుల పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛారణల నడుమ భక్తిశ్రద్ధలతో సాగింది.

​యాగం పరిసమాప్తి సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారివి.కె. శీనానాయక్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం వేద పండితులు వారికి వేదోక్తంగా దివ్య ఆశీర్వచనాలు పలికి, శ్రీ అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.

​ఈ దివ్య యాగ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీనివాసరావు, రాఘవరాజు, కళావతి, ప్రత్యేక ఆహ్వానితులు రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

​జారీ చేసిన వారు:

ప్రజా సంబంధాల అధికారి, శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada