Vijayawada: చందర్లపాడులో 18న ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్ డా. లక్ష్మీశ

Vijayawada: చందర్లపాడులో ఈనెల 18న నందిగామ నియోజకవర్గ స్థాయి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 17 Sept 2026 7:01 PM IST
Vijayawada
X

Vijayawada: చందర్లపాడులో 18న ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్ డా. లక్ష్మీశ

విజయవాడ: ఒక నెల - ఒక నియోజకవర్గo - నాలుగు పర్యటనలు" కార్యక్రమంలో భాగంగా నందిగామ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్యక్రమాన్ని సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు.

చందర్లపాడు తునికిపాటి ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10.00 గంటల నుంచి ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి అధికారులు అర్జీలను స్వీకరించనున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నారని కలెక్టర్ తెలిపారు.

నందిగామ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ కోరారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.