Vijayawada: విజయవాడ కరాటే పోటీల్లో చీరాల సందీప్ స్కూల్ విద్యార్థుల ఘనత
Vijayawada: విజయవాడ నేషనల్ ఓపెన్ కరాటే పోటీల్లో బాపట్ల జిల్లా చీరాల సందీప్ స్కూల్ విద్యార్థులు కీర్తి పవన్ సాయి, కౌశిక్ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు.
Vijayawada: విజయవాడ కరాటే పోటీల్లో చీరాల సందీప్ స్కూల్ విద్యార్థుల ఘనత
విజయవాడ: విజయవాడలో ఈరోజు జరిగిన నేషనల్ ఓపెన్ కరాటే టోర్నమెంట్‌లో,చీరాల సందీప్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు.
ఈ టోర్నమెంట్‌లో ఎల్లో బెల్ట్ కాటా విభాగంలో పడవల కీర్తి పవన్ సాయి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, వైట్ బెల్ట్ కాటా విభాగంలో రాయపాటి వెంకట సాయి కౌశిక్ ద్వితీయ స్థానాన్ని సాధించాడు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సందీప్ స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ టి. వెంకటేశ్వర్లు (టీవీ సార్) మాట్లాడుతూ, కరాటే నేర్చుకోవడం ద్వారా క్రమశిక్షణ, ఆత్మరక్షణ, ఆరోగ్యం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. యువత తప్పనిసరిగా ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందాలని కోరారు.
సందీప్ హై స్కూల్ ప్రిన్సిపల్ జి. లావణ్య మాట్లాడుతూ, మారుతున్న సమాజానికి అనుగుణంగా పెరుగుతున్న ఆకతాయిల ఆగడాలను ఎదుర్కోవడానికి బాలికలు యుద్ధ విద్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
కరాటే ఇన్‌స్ట్రక్టర్ ఎన్. శివప్రసాద్ మరియు ఎలిమెంటరీ స్కూల్ ఇంచార్జి ఉమాదేవి విజేతలను అభినందించి ప్రశంసించారు. విజేతలిద్దరూ బాపట్ల జిల్లాకు చెందిన చీరాల సందీప్ స్కూల్ విద్యార్థులు కావడం విశేషం.




