Vijayawada: అక్టోబర్ 14న శ్రీ దుర్గమ్మవారిని దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గమ్మవారిని అక్టోబర్ 14న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
Vijayawada: అక్టోబర్ 14న శ్రీ దుర్గమ్మవారిని దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము
విజయవాడ: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ అధికారులు పటిష్టమైన అన్ని ఏర్పాట్లు చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు
మంగళవారం ఇంద్రకీలాద్రి మీడియా పార్టీ వద్ద దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయని తెలిపారు. అక్టోబర్ 11వ తేదీన ఘనంగా ప్రారంభమైన ఉత్సవాలు భక్తుల విశేష రద్దీ నడుమ విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
**భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు.
దసరా మహోత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు దేవస్థానం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఉత్సవాలు సజావుగా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
**అక్టోబర్ 14న ఇంద్రకీలాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నాలుగో రోజైన అక్టోబర్ 14వ తేదీన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గమ్మవారిని దర్శించుకోనున్నారని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు వివరించారు.
***అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న రాష్ట్రపతి.
అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించినట్లు కమిషనర్ తెలిపారు.
***రాష్ట్రపతి పర్యటనకు సమన్వయంతో ఏర్పాట్లు.
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన అధికారిక సమాచారం, ఏర్పాట్ల వివరాలను దేవాదాయ శాఖ కమిషనర్ ఈ సందర్భంగా వెల్లడించారు. పర్యటన ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సంబంధిత అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు, అమ్మవారి దర్శనానికి విచ్చేసే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన దర్శన అనుభవాన్ని కల్పించడమే లక్ష్యంగా దేవస్థానం, జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు.




