Poranki: పోరంకి బాలాజీ నగర్‌లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Poranki: పోరంకి బాలాజీ నగర్‌లో సేవా మేరా యోగ్ దాన్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మొక్కలు నాటారు. కాలనీ వాసులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

Ramana, Penamaluru
Published on: 2 Oct 2026 5:59 PM IST
Poranki
X

Poranki: పోరంకి బాలాజీ నగర్‌లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్

పోరంకి: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు నిర్వహిస్తున్న ‘సేవా మేరా యోగ్ దాన్’ కార్యక్రమంలో భాగంగా పోరంకి–నిడమానూరు రోడ్డులోని బాలాజీ నగర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

కాలనీ వాసులతో కలిసి నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాలాజీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ కె.వి. ప్రసాద్ చౌదరి ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.

రానున్న రోజుల్లో బాలాజీ నగర్‌లో 2,000 మొక్కలు నాటడంతో పాటు, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేలా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కాలనీ కమిటీ సభ్యులు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ మంచి కార్యక్రమాలను చేపడుతున్న కాలనీ వాసులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అభినందించారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru