Penamaluru: పోరంకిలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
Penamaluru: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు.
Penamaluru: పోరంకిలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
పెనమలూరు: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’*లో భాగంగా,పోరంకి బాలాజీ నగర్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెనమలూరు నియోజకవర్గ *ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి, వాటిని బాధ్యతగా సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కలు నాటుదాం…పచ్చదనాన్ని పెంచుదాం…భావితరాలకు మంచి భవిష్యత్తును అందిద్దాఓ. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు..




