Vijayawada: దుర్గగుడిలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి!

Vijayawad: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 6 Oct 2026 9:52 AM IST
Vijayawada
X

Vijayawada: దుర్గగుడిలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి!

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళ వారం దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయ శాఖ అధికారులు సాదరంగా ఆహ్వానం పలికి, అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

దసరా సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు మంత్రివర్యులు వారికి వేద ఆశీర్వచనం అందజేయగా, అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI