Vijayawada: సాంకేతికతతో పాటు కూచిపూడి కళను విస్తరిస్తున్న బెందాది శ్రీయ!
Vijayawada: కూచిపూడి కళాకారిణి, బి.టెక్ (AI&ML) విద్యార్థిని బెందాది శ్రీయ ఆధునిక విజ్ఞానంతో పాటు కూచిపూడి నాట్యాన్ని ప్రచారం చేస్తూ నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
Vijayawada: సాంకేతికతతో పాటు కూచిపూడి కళను విస్తరిస్తున్న బెందాది శ్రీయ!
Vijayawada: తెలుగు నేలపై పుట్టి ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటిచెప్పిన శాస్త్రీయ నృత్యరీతి కూచిపూడి. ఈ కళా వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు విజయవాడకు చెందిన యువ నర్తకి బెందాది శ్రీయ. ప్రముఖ కూచిపూడి నృత్య గురువు బెందాది స్వర్ణలత, బెందాది చంద్రమోహన్ దంపతుల కుమార్తె శ్రీయకు తల్లే తొలి గురువు. చిన్ననాటి నుంచే నృత్య సాధన చేస్తూ, అనేక వేదికలపై ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె ప్రతిభను గుర్తించిన కళాభిమానులు ‘నాట్యమయూరి’ బిరుదుతో సత్కరించారు.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (AI & ML) విభాగంలో బీటెక్ పూర్తి చేస్తూనే, కూచిపూడి నృత్యంలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాటు సంప్రదాయ కళలపైనా ఆసక్తి చూపుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తల్లి స్వర్ణలత మార్గదర్శకత్వంలో నడుస్తున్న ‘నాట్యనిలయం’ ద్వారా విద్యార్థులకు నృత్య శిక్షణ అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద పిల్లలకు ఉచితంగా కూచిపూడి నేర్పిస్తూ కళను సమాజానికి చేరువ చేస్తున్నారు.




