Vijayawada: కాణిపాక గణనాథునికి దుర్గమ్మ పట్టువస్త్రాల సమర్పణ
Vijayawada: కాణిపాకం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
Vijayawada: కాణిపాక గణనాథునికి దుర్గమ్మ పట్టువస్త్రాల సమర్పణ
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ అమ్మవారి దేవస్థానం నుండి స్వామివారికి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలను సమర్పణ. సిద్ధి బుద్ధి సమేతైన వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మల కన్న అమ్మ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం నుండి స్వామివారికి సాంప్రదాయ బద్ధంగా పట్టు వస్త్రాలను ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారులు సమర్పించారు.
దుర్గమ్మకు అత్యంత ప్రీతి పాత్రులైన సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామికి దుర్గమ్మ దేవస్థానం నుండి తీసుకువచ్చిన పట్టు చీరలు 15 రకాల సుగంధ పూలు ,పండ్లు ,గాజులు , వెండి తట్ట లో తీసుకువచ్చి ఆలయ మాడవీధుల గుండా మేళ తాళాలతో వేద మంత్రాల నడుమ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు దుర్గమ్మ దేవస్థానం అధికారులకు స్వామి వారి దర్శనం కల్పించి స్వామి వారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను వారికి అందించారు. అనంతరం దుర్గం దేవస్థానం వారు తీసుకువచ్చిన అమ్మవారి చిత్రపటాలని అమ్మవారి ప్రసాదాన్ని కాణిపాక దేవస్థానం ఈ. వో పెంచల కిషోర్ , దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఏ ఈ ఓ లు రవి రవీంద్రబాబు, ధనపాల్ , బోర్డు సభ్యులకు అందించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, వేద పండితులు సుబ్బారావు స్వామి, బాబు స్వామి, కౌశిక్ స్వామి పాల్గొన్నారు.




