Indrakeeladri: దసరా ఉత్సవాల ముగింపు అనంతరం భవాని దీక్షాధరుల రద్దీ!

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనానికి భవానీ భక్తులు పోటెత్తారు. ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పరిశీలించారు.

Satyanarayana, Vijayawada
Published on: 21 Oct 2026 12:32 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: దసరా ఉత్సవాల ముగింపు అనంతరం భవాని దీక్షాధరుల రద్దీ!

Indrakeeladri: దసరా ఉత్సవాలు ముగిసిన మొదటి రోజు ఇంద్రకీలాద్రి పై శ్రీ కనక దుర్గ అమ్మవారు శ్రీ రాజ రాజేశ్వరి దేవి గా దర్శనమిస్తుండగా, భవాని దీక్ష స్వీకరించిన భవాని భక్తులతో ఇంద్రకీలాద్రి, విజయవాడ వన్ టౌన్ కిటకిటలాడుతుంది.

ఒక క్రమపద్దతి లో వేలాది మంది భక్తులు క్యూ మార్గం ద్వారా కొండపైకి చేరుకుంటున్నారు. 3 హోల్డింగ్ ఏరియాలు, సీతమ్మ వారి పాదాలు, మున్సిపల్ ఆఫీస్ ఏరియా ఎర్రదనం సంతరించుకుంది.

తెల్లవారు జాము నుండే ఆలయ ఈవో శీనా నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, పోలీస్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ భక్తుల రద్దీ క్రమబద్దీకరణ చేస్తున్నారు.

అన్ని దర్శనం క్యూ లైన్ తో పాటు చిన్న రాజగోపురం నుండి విఐపి మార్గం పూర్తిగా తెరచి భవానీ భక్తులను దర్శనంకు అనుమతిస్తున్నామని, ఉచిత అన్న ప్రసాదం నిరంతరం అందేలా చర్యలు తీసుకున్నామని ఈవో శీనానాయక్ తెలిపారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada