Indrakeeladri: దుర్గగుడిలో మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు
Indrakeeladri: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహిళా సిబ్బంది రక్షణకు పోష్ చట్టం-2013 ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటైంది.
Indrakeeladri: దుర్గగుడిలో మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు
ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారులు, ఉద్యోగులు మరియు సిబ్బంది పని ప్రదేశాలలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణంలో పనిచేసేందుకు గాను 'అంతర్గత ఫిర్యాదుల కమిటీ' (Internal Complaints Committee - ICC) ని ఏర్పాటు చేస్తూ దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ 'పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక, నిషేధ మరియు పరిష్కార చట్టం - 2013' (POSH Act) నిబంధనల ప్రకారం ఈ కమిటీని నియమించారు.
ఈ సందర్భంగా దేవస్థాన మీటింగ్ హాల్లో మహిళా సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈవో వి.కె. శీనా నాయక్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. మహిళలు తమ సమస్యలను బయటి వ్యక్తులతో చెప్పుకోలేరని, తోటి మహిళలతోనే నిస్సంకోచంగా పంచుకోగలరనే ఉద్దేశంతో దేవస్థానంలోని మహిళలతోనే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మహిళా ఉద్యోగులు ఏదైనా సందర్బంగా ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా, ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకోవచ్చని భరోసా ఇచ్చారు. విధుల్లో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే నేరుగా ఈ కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. దేవస్థాన వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికీ "భక్తి, భయం, బాధ్యత" అనే మూడు సూత్రాలు అత్యంత ముఖ్యమని, తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, తప్పు చేయడానికి మాత్రమే భయపడాలని ఈవో స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మహిళాకమిటీ సభ్యులను అందరికి పరిచయం ఈవో చేశారు.
వందలాదిమంది మహిళా సిబ్బంది పని చేస్తున్న ఈ పుణ్యక్షేత్రంలో మహిళల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) సభ్యులు:
శ్రీమతి ఎల్. రమ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE) – ప్రిసైడింగ్ ఆఫీసర్
శ్రీమతి ఎన్.వి. లక్ష్మీ ప్రసన్న, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (AEO) – సభ్యురాలు
శ్రీమతి వై. హేమ దుర్గాంబ, సూపరింటెండెంట్ – సభ్యురాలు
శ్రీ గుంటూరు శేషమోహన్, సీనియర్ లీగల్ అడ్వైజర్ – ఎక్స్టర్నల్ మెంబర్ (బాహ్య సభ్యులు)




