Vijayawada: విజయవాడలో భారీ చెట్టు నేలకూలడంతో నిలిచిన ట్రాఫిక్!

Vijayawada: విజయవాడ కృష్ణలంకలో భారీ వర్షాలకు చెట్టు నేలకూలి సర్వీస్ రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Ramana, Penamaluru
Updated on: 25 Sept 2026 7:16 AM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడలో భారీ చెట్టు నేలకూలడంతో నిలిచిన ట్రాఫిక్!

Vijayawada: విజయవాడ కృష్ణలంకలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో భారీ చెట్టు గాలికి నేలకూలింది. కృష్ణలంక సర్వీస్ రోడ్డుపై చెట్టు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై చెట్టు అడ్డంగా పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భారీ వర్షాలకు తోడు బలమైన గాలులు వీస్తుండటంతో చెట్టు కూలినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

📍 కృష్ణలంక సర్వీస్ రోడ్డు, విజయవాడ

⚠️ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచన...!!

Ramana, Penamaluru

Ramana, Penamaluru