Gudivada: గుడివాడలో రూ.1.97 కోట్లతో మున్సిపల్ పార్కుల అభివృద్ధి
Gudivada: గుడివాడలో రూ.1.97 కోట్ల వ్యయంతో మున్సిపల్ పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, తుమ్మల రామబ్రహ్మం పార్కును ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు.
Gudivada: గుడివాడలో రూ.1.97 కోట్లతో మున్సిపల్ పార్కుల అభివృద్ధి
గుడివాడ: పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు, చిన్నారులకు ఆటవిడుపు, పెద్దలకు ఆరోగ్య పరిరక్షణ కల్పించే లక్ష్యంతో గుడివాడలో మున్సిపల్ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా పార్కులను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్‌లోని శ్రీ రావి శోభనాద్రి చౌదరి మున్సిపల్ పార్కులో రూ.80 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాము స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం వాసవి చౌక్ వద్ద రూ.1.17 కోట్లతో ఆధునిక హంగులతో అభివృద్ధి చేసిన తుమ్మల రామబ్రహ్మం మున్సిపల్ పార్కును ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. రామబ్రహ్మం కుటుంబ సభ్యురాలు తుమ్మల పంకజవల్లి ఎమ్మెల్యే రాముతో కలిసి రిబ్బన్ కట్ చేసి పార్కును ప్రారంభించగా, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
పార్కును సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై తుమ్మల రామబ్రహ్మం కుటుంబ సభ్యులు పంకజవల్లి, తుమ్మల శాంతి ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్‌తో కలిసి ఎమ్మెల్యే పార్కులో కలియతిరిగి అక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు.
పార్కులో ఏర్పాటు చేసిన ఆట వస్తువులను వినియోగించుకుంటూ ఆనందంగా గడుపుతున్న చిన్నారులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట పరికరాలు బాగున్నాయని, పార్కు అభివృద్ధి తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం తుమ్మల రామబ్రహ్మం కుటుంబ సభ్యురాలు పంకజవల్లిని ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ... నిత్యం వివిధ పనుల ఒత్తిడితో జీవనం సాగించే ప్రజలకు కొంత సమయం ప్రశాంతంగా గడిపేందుకు, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపేందుకు పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పట్టణాల్లో పార్కులు కేవలం వినోద ప్రదేశాలే కాకుండా ప్రజల ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు, సామాజిక అనుబంధాలను పెంపొందించడానికి దోహదపడే ముఖ్యమైన ప్రజావేదికలని పేర్కొన్నారు.
చిన్నారులు స్వేచ్ఛగా ఆడుకునేందుకు, యువత వ్యాయామం చేసేందుకు, వృద్ధులు ప్రశాంతంగా సేదతీరేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మున్సిపల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
గుడివాడలో వివిధ రంగాల్లో అభివృద్ధి, వ్యవస్థల్లో మార్పులకు కృషి చేస్తున్నామని, అదే స్ఫూర్తితో పట్టణంలోని పార్కులను కూడా ప్రజలకు ఉపయోగపడేలా ఆధునికీకరిస్తున్నామని ఎమ్మెల్యే రాము వివరించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగేందుకు సహకరిస్తున్న మున్సిపల్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
పార్కులను అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో, వాటిని పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్కులకు వచ్చే ప్రజలు చెత్తాచెదారం వేయకుండా పరిశుభ్రతను పాటించాలని, ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు, చిన్నారుల ఆట వస్తువులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలందరూ భాగస్వాములైనప్పుడే అభివృద్ధి పనుల ఫలితాలు దీర్ఘకాలం నిలుస్తాయని అన్నారు.
పార్కుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, జనసేన ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్,పట్టణ టిడిపి అధ్యక్షులు పండ్రాజు సాంబశివరావు,ME సతీష్ చంద్ర, DE శివాజీ, AE లు..... శివాజీ, సత్యనారాయణ, శ్రావణ్,చేకూరు జగన్మోహన్రావు, లింగం ప్రసాద్, గోర్జీ సత్యనారాయణ, బొంబాయి శ్రీను, దారపురెడ్డి మనీశ్వరరావు,యార్లగడ్డ సుధారాణి, దింట్యాల రాంబాబు, కొడాలి రామరాజు, రామదేని వేణుబాబు, పొట్లూరి కృష్ణారావు,బాలసాని భవాని,నిమ్మగడ్డ సత్యసాయి. కంచర్ల సుధాకర్, తులసి రాణి, వేసపోగు ఇమ్మానుయేలు, పైడిముక్కల వంశీ, షణ్ముఖ రెడ్డి, షేక్ మతిన్, గుడివాడ జోన్స్ దయానందం, సయ్యద్ జబీన్, దగ్గుమిల్లి పృద్వి, అట్లూరి స్వరూప్, గోవాడ శివ, అల్లాడ శ్రీను, జయశ్రీ, మల్లికా బేగం, హస్మ,జనసేన నాయకులు:- కొదమల గంగాధర్, వడ్డాది లక్ష్మీకాంత్, J. కిరణ్, కంచనపల్లి సీతారాం, షేక్ నాగూర్ భాష,బిజెపి నాయకులు:- లింగం చిట్టిబాబు, పట్టణ అధ్యక్షుడు ఆర్కె, పలువురు కూటమి నాయకులు మున్సిపల్ అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




