Indrakeeladri: కనకదుర్గమ్మ వారికి బంగారు హారం సమర్పణ
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారికి పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన భక్తులు 100.500 గ్రాముల బంగారు హారాన్ని సమర్పించారు.
Indrakeeladri: కనకదుర్గమ్మ వారికి బంగారు హారం సమర్పణ
ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారికి శుక్రవారం సాయంత్రం భక్తులు విశేష కానుకగా సువర్ణ హారాన్ని సమర్పించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన శ్రీ కే.జగన్మోహనరెడ్డి గారి కుమార్తె కుమారి కే.శ్రీ వర్షిణి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అమ్మవారి పట్ల గల అపార భక్తిప్రపత్తులతో 100 గ్రాముల 500 మిల్లీ గ్రాముల (100.500 గ్రాములు) బరువు కలిగిన బంగారు హారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.
అనంతరం దాత కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో శ్రీ దుర్గమ్మ వారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వారికి వేదోక్తంగా ఆశీర్వచనం చేయగా, ఆలయ ఉప ప్రధానార్చకులు శ్రీ బి. శంకర శాండిల్య శ్రీ అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.
జారీ చేసిన వారు: ప్రజా సంబంధాల అధికారి, శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ.




