Doulthabad: కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్-2 పనులకు తిరుపతిరెడ్డి భూమి పూజ!

Doulthabad: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం సుల్తాన్‌పూర్‌లో నారాయణపేట–మక్తల్–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్-2 పనులకు శుక్రవారం ఎనుముల తిరుపతిరెడ్డి భూమి పూజ చేశారు.

AKRAM PASHA , KODANGAL
Published on: 20 Nov 2026 3:58 PM IST
Doulthabad
X

Doulthabad: కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్-2 పనులకు తిరుపతిరెడ్డి భూమి పూజ!

వికారాబాద్ జిల్లా: దౌల్తాబాద్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామ శివారులో నారాయణపేట మక్తల్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ టు గ్రావిటీ కెనాల్ పనులకు ఇవాళ కోడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముఖ్యమంత్రి సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోడంగల్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తాము పని చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

AKRAM PASHA , KODANGAL

AKRAM PASHA , KODANGAL