Vijayawada: విజయవాడ మేయర్ పీఠంపై దేవినేని కుటుంబం గురి
Vijayawada: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రేసులో దేవినేని కుటుంబం నుంచి దేవినేని మహిత పేరు తెరపైకి వచ్చింది. బెజవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Vijayawada: విజయవాడ మేయర్ పీఠంపై దేవినేని కుటుంబం గురి
విజయవాడ: విజయవాడ మేయర్ పీఠంపై దేవినేని కుటుంబం గురి..! మేయర్ రేసులో దేవినేని మహిత పేరు తెరపైకి రావడంతో బెజవాడ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది..!
కేవలం పేరు కోసమో.. పదవి కోసమో కాదు..! విజయవాడ నగర రాజకీయాల్లో తమదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో దేవినేని కుటుంబం అడుగులు వేస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
మంత్రి నారా లోకేష్‌కు సన్నిహితుడిగా పేరున్న దేవినేని చంద్రశేఖర్ కుటుంబం నుంచి మహిత పేరు వినిపించడం వెనుక రాజకీయంగా కీలక సమీకరణాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవినేని మహితకు అవకాశం కల్పిస్తే.. అది కేవలం ఒక అభ్యర్థి ఎంపిక మాత్రమే కాదు.. విజయవాడ రాజకీయాల్లో ఒక కీలక నిర్ణయంగా మారే అవకాశం ఉంది.
మహిళా నాయకత్వానికి ప్రాధాన్యత.. నగర అభివృద్ధిపై స్పష్టమైన దృష్టి.. ప్రజల సమస్యలపై బాధ్యతాయుతమైన స్పందన.. ఇవే మేయర్ పదవికి అసలైన అర్హతలు కావాలి. ఆ అంచనాలకు అనుగుణంగా పనిచేసే అవకాశం దేవినేని మహితకు దక్కాలన్నది ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచే వారి వాదన.




