Vijayawada: విజయవాడలో నిత్యావసర ధరల పెరుగుదలపై సీపీఐ నిరసన ఆందోళన!
Vijayawada: విజయవాడలో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు విమర్శలు.
Vijayawada: విజయవాడలో నిత్యావసర ధరల పెరుగుదలపై సీపీఐ నిరసన ఆందోళన!
Vijayawada: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు విమర్శించారు. నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ మంగళవారం విజయవాడ కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్‌లో 37, 51, 52, 53 డివిజన్ల ఆధ్వర్యంలో కొట్టు రమణారావు అధ్యక్షతన సీపీఐ ఆందోళన నిర్వహించింది.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే సంపద సృష్టించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. సామాన్యులపై నిత్యావసర భారాలు మోపడం ద్వారా సంపద సృష్టిస్తోందా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని ఆరోపించారు. బియ్యం కొనుగోలు చేయడమే భారంగా మారిందని, ఉల్లిపాయలు కిలో రూ.75, కందిపప్పు రూ.130, వంటనూనె రూ.190 నుంచి రూ.200, పంచదార రూ.75 వరకు పలుకుతున్నాయని తెలిపారు.
ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరలకు 14 రకాల నిత్యావసర సరుకులు అందించాల్సిన ప్రభుత్వం కేవలం బియ్యానికే పరిమితం చేసిందని విమర్శించారు. దేశంలో అమల్లో ఉన్న ఆహార భద్రత చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కూలీ రేట్లు, ఉద్యోగుల వేతనాలు, ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరగకపోయినా ఖర్చులు మాత్రం వేల రూపాయల్లో పెరిగాయని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న విధానాలకు పొంతన లేదని విమర్శించారు. ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.
నగర కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణారావు మాట్లాడుతూ నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా తారుమారవుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను నియంత్రించడంతో పాటు పేదలకు చౌక ధరలకు నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో . నగర కార్యదర్శి వర్గ సభ్యులు. తాడి పైడయ్య. నగర కార్యవర్గ సభ్యులు సింగరాజు సాంబశివరావు. డివిజన్లో కార్యదర్శులు. యేసు. రాయన గురునాథం. రాజాకుల శ్రీనివాసరావు. బోక కదలింప చేయాలంటే మోక దుర్గారావు. మెకానిక్ అప్పారావు. సీనియర్ నాయకులు ఒడిసెల సింహాద్రి గారు. పొట్లూరు చిన్న. లంకే సాయి. సిహెచ్ మారుతి. మహిళా సమైక్య నాయకులు. అరగంజి దుర్గమ్మ. బంక ఝాన్సీ లక్ష్మి. కొట్టు విజయలక్ష్మి సుజాత అచ్చ అమ్మ దుర్గా శ్రావణమ్మ వందన సమర్పణ చేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.




