Vijayawada: విజయవాడ దసరా ఉత్సవాల్లో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ!
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో అమ్మవారి భక్తులకు నూతన అన్నప్రసాద భవనంలో ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
Vijayawada: విజయవాడ దసరా ఉత్సవాల్లో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ!
Vijayawada: విజయవాడ దసరా ఉత్సవాలలో అమ్మవారి భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నప్రసాదాలను ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా అందజేస్తున్నారు. నూతనంగా ఏర్పాటుచేసిన అన్న ప్రసాద భవనంలో భక్తులు గణనీయమైన సంఖ్యలో అన్న ప్రసాదాలను స్వీకరిస్తున్నారు.
భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ అధికారులు, పర్యవేక్షణలో సిబ్బంది అందచేస్తూనే ఉన్నారు.
అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులు మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో అన్న ప్రసాదాలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్నప్రసాదాలు చాలా బాగున్నాయి అని అధికారులు ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు




