Vijayawada: కాంగ్రెస్ ‘ఓట్ చోర్’ నిరసన.. పాల్గొన్న ఆమంచి కృష్ణమోహన్, జేడీ శీలం!

Vijayawada: విజయవాడ లెనిన్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ 'ఓట్ చోర్' నిరసన. ఆమంచి కృష్ణమోహన్, జేడీ శీలం పాల్గొనగా, వైఎస్ షర్మిలతో పాటు పలువురు నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 11 Oct 2026 3:30 PM IST
Vijayawada
X

Vijayawada: కాంగ్రెస్ ‘ఓట్ చోర్’ నిరసన.. పాల్గొన్న ఆమంచి కృష్ణమోహన్, జేడీ శీలం!

Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఓట్ చోర్’ ఉద్యమం. ఓటు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ నిరసన. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో ఆమంచి కృష్ణమోహన్‌, జేడీ శీలం తదితర కాంగ్రెస్ నాయకుల ఆందోళన. దేశవ్యాప్తంగా ఓటు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ చోర్’ ఉద్యమంలో భాగంగా శనివారం విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

నగరంలోని లెనిన్‌ సెంటర్‌లో జరిగిన

ఈకార్యక్రమంలో చీరాల మాజీ శాసనసభ్యులు, బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఓటర్ల హక్కుల పరిరక్షణకు తమ మద్దతు ప్రకటించారు.

ఓటర్ల జాబితాల్లో తప్పులపై కాంగ్రెస్ ఆందోళన

ఎన్నికల ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితాల్లో పారదర్శకత ఉండాలని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు భద్రంగా ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నాయకత్వంలో, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల సహకారంతో విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌ నుంచి లోక్‌భవన్‌ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

పోలీసుల ఆంక్షలు.. నాయకుల అరెస్టులు

నిరసన కార్యక్రమం నేపథ్యంలో అక్టోబర్‌ 10న విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను ఆమె నివాసం వద్ద గృహనిర్బందించారు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి విజయవాడ భవాని పురం పోలీస్ స్టేషన్ కు తరలిచారు , మరికొందరు నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని కొందరిని అదుపులోకి తీసుకున్నారు.కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ నాయకులు,స్టూడెంట్స్ యూనియన్స్,వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులను పోలీస్ లు అరెస్ట్ చేసారు.

కాంగ్రెస్ ప్రధాన డిమాండ్లు

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిలిపివేయాలి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలి. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి. రాజకీయ పార్టీలు, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కును గౌరవించాలి.

ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థ భరోసా కల్పించాలని, ఓటర్ల జాబితాల రూపకల్పనలో పారదర్శకత పాటించాలని వారు కోరారు.

ఢిల్లీలో రాహుల్‌ గాంధీ తదితర జాతీయ స్థాయి నాయకులు చేపడుతున్న ‘ఓట్ చోర్’ ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రజాస్వామ్యబద్ధమైన మార్గాల్లో పోరాటాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

“ఓటు హక్కు పరిరక్షణే ప్రజాస్వామ్య పరిరక్షణ” అనే నినాదంతో అర్హులైన ప్రతి పౌరుడి ఓటుకు భద్రత కల్పించాలన్నదే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు.

— ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC)

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala