Indrakeeladri: క్షేత్రస్థాయిలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, సీపీ రాజశేఖర్ బాబు నిరంతర పర్యవేక్షణ
Indrakeeladri: దసరా ఉత్సవాల వేళ భక్తుల సౌకర్యార్థం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Indrakeeladri: క్షేత్రస్థాయిలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, సీపీ రాజశేఖర్ బాబు నిరంతర పర్యవేక్షణ
Indrakeeladri: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ దసరా ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో భక్తులతో నేరుగా మాట్లాడి, దర్శన ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ, తాగునీటి సరఫరా, అన్నప్రసాదం పంపిణీ, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను క్రమబద్ధీకరించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టడం, వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేస్తున్నారు.
దసరా ఉత్సవాల నిర్వహణలో అన్ని శాఖల మధ్య పటిష్టమైన సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటూ, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశిస్తున్నారు. భక్తుల సౌకర్యాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రతి సమస్యపై తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని స్పష్టం చేస్తున్నారు. సమష్టి కృషి, సమర్థవంతమైన పర్యవేక్షణతో అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ప్రశాంతమైన, సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతి కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేస్తున్నాయి.




