Vijayawada: ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం!

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే దసరా మహోత్సవాలకు రావాల్సిందిగా సీఎం చంద్రబాబుకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ఆహ్వానపత్రిక అందించారు.

Satyanarayana, Vijayawada
Published on: 30 Sept 2026 1:06 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం!

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే దసరా మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానపత్రిక అందించారు.

ఈ సందర్భంగా అర్చకులు ముఖ్యమంత్రికి అమ్మవారి ప్రసాదాన్ని అందించి వేదాశీర్వచనం ఇచ్చారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన సీఎం భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సీఎంను కలిసి ఉత్సవాలకు ఆహ్వానించిన వారిలో దుర్గగుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఈఓ శీనా నాయక్, బోర్డు సభ్యులు ఉన్నారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada