Indrakeeladri: దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా ఆజాద్.. క్యూలైన్ల పరిశీలన
Indrakeeladri: ఇంద్రకీలాద్రి దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర్ ఆజాద్ ఘాట్ రోడ్డులోని క్యూలైన్లు, నూతన అన్నప్రసాద భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Indrakeeladri: దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా ఆజాద్.. క్యూలైన్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రి పై జరిగే దసరా ఉత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ గా ప్రభుత్వం నియమించిన దేవాదాయశాఖ అదనపు కమిషనర్ ఎస్ ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఈరోజు ఉదయం ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ఆరంభం నుండి క్యూ లైన్లు పరిశీలన చేశారు.
ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ),ఈవో వికె శీనా నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఎల్.రమాదేవి, బి. రాంబాబు, డి వి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాల్లో క్యూ లైన్ల సంఖ్య, ఎగ్జిట్ గేట్స్ ఉండే ప్రాంతాలు, పూజలు జరిగే ప్రదేశం దారి తదితర ప్రదేశాలు పరిశీలన చేశారు.నూతన అన్న ప్రసాద భవనం పరిశీలించారు.




