Vijayawada: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎస్. రాధా చౌహాన్!

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారిని కేంద్ర కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ ఎస్. రాధా చౌహాన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Satyanarayana, Vijayawada
Published on: 1 Oct 2026 9:44 AM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎస్. రాధా చౌహాన్!

Vijayawada: భారత ప్రభుత్వ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌,Department of Personnel and Training (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) పూర్వ కార్యదర్శి శ్రీమతి ఎస్. రాధా చౌహాన్ ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.

​ఆలయానికి విచ్చేసిన ఆమెకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శీనా నాయక్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనంనకు తోడ్కొని వెళ్లారు. అనంతరం శ్రీమతి రాధా చౌహాన్ శ్రీ కనకదుర్గమ్మ వారి మూలవిరాట్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచన మండపంలో ఆమెకు వేదాశీర్వచనం చేయగా, ఈవో శీనా నాయక్ శ్రీ అమ్మవారి వస్త్రం, జ్ఞాపిక మరియు లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada