Vijayawada: వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉండాలి.. పీవీఎన్ మాధవ్!
Vijayawada: వాయుగుండం వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయం అందించాలని బీజేపీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపు.
Vijayawada: వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉండాలి.. పీవీఎన్ మాధవ్!
Vijayawada: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సూచించారు. గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో వర్ష పరిస్థితులపై ఆయన సమీక్షించారు.
సకాలంలో వర్షపాతం లేకపోవడంతో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో ప్రస్తుత వర్షాలను ప్రజలు స్వాగతిస్తున్నారని మాధవ్ తెలిపారు. అయితే భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ముంపు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎపి బిజెపి చీఫ్ మాధవ్ సూచనలు:
వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తక్షణ సహాయానికి చర్యలు తీసుకోవాలి. ముంపు పరిస్థితులు, నష్టం వివరాలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాలి. తమ మండలాలు, గ్రామాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వానికి తెలియజేయాలి.
అవసరమైన చోట్ల ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ప్రజలకు సహాయం అందించాలి. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, వర్షాలు తగ్గే వరకు పార్టీ శ్రేణులు పూర్తి అప్రమత్తతతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.




