Machilipatnam: మచిలీపట్నంలో ఘనంగా భారతీయ వికాస్ పరిషత్ సమావేశం!

Machilipatnam: మచిలీపట్నం ఎస్.ఎస్.ఆర్ డిగ్రీ కాలేజీలో భారతీయ వికాస్ పరిషత్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు దేశభక్తి పోటీల్లో బహుమతులు ప్రదానం చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 30 Sept 2026 5:55 PM IST
Machilipatnam
X

Machilipatnam: మచిలీపట్నంలో ఘనంగా భారతీయ వికాస్ పరిషత్ సమావేశం!

Machilipatnam: ప్రపంచ దేశాలలో భారతదేశం ఎంతో ఎత్తుకు ఎదిగిందని భారతీయ వికాస్ పరిషత్ జాతీయ సేవా కన్వీనర్ షా రూప్ చంద్ జైన్ అన్నారు.బుధవారం మచిలీపట్నం భారతీయ వికాస్ పరిషత్ సమావేశం జగన్నాధపురం ఎస్. ఎస్. ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగింది. ఈ సందర్భంగా జైన్ మాట్లాడుతూ భారతదేశం ఐక్యతను చాటి చెప్పడానికి నిరంతరం దేశవ్యాప్తంగా లక్షల మంది పనిచేస్తున్నారని అన్నారు. మచిలీపట్నం శాఖ మచిలీపట్నం పెడన పరిసర ప్రాంతాల్లోని విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తిపై పోటీలు నిర్వహించి 200 మందికి బహుమతులు ఇవ్వటం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని, నేటి సమాజిక పరిస్థితిలలో నైతిక విలువలతో కూడిన విద్యలు ఆవశ్యకత ఎంతగానో ఉందని అన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు పట్ల మెలకువతో ఉండాలని అన్నారు. టీవీలు సెల్ ఫోన్లు పిల్లలను దూరంగా ఉంచాలని, విద్యార్థులు దిశా నిర్దేశం చేసుకునే ఎదగాలని అన్నారు.

భారతీయ వికాస్ పరిషత్ నైతిక విలువల కమిటీ చైర్మన్ వి హనుమంతరావు మాట్లాడుతూ దేశ సమగ్ర అభివృద్ధిలో భారతీయ వికాస పరిషత్ భాగస్వామ్యం కావడం ఆనందదాయకమని అన్నారు. సంస్థ ఉపాధ్యక్షులు కొత్తగుండు రమేష్,కార్యదర్శి వి. నాగప్రవీణ్ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన వందేమాతరం ని భారతీయ వికాస్ పరిషత్ ద్వారా పదివేల మందితో పాటించటం దేశభక్తి పై నిర్వహించిన పోటీలలో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 200 మందికి బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి వి.వి.రమణ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల సంఘ ఉపాధ్యక్షులు స్వామి, మాదిరెడ్డి బాబా, తల్లిదండ్రులు, పలు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు బాలబాలికలు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.