Vijayawada: ఉపాధ్యాయులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి: NTA

Vijayawada: విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడి చేసిన రాజకీయ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (NTA) డిమాండ్ చేసింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 Sept 2026 6:41 PM IST
Vijayawada
X

Vijayawada: ఉపాధ్యాయులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి: NTA

Vijayawada: విజయవాడ శాప్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులపై కొందరు రాజకీయ వ్యక్తులు చేసిన దాడులను నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు గారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేతాజీ సర్కిల్ రాయచోటి నందు ఏర్పాటుచేసిన సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ సమావేశంలో శ్రీనివాసరాజు గారు మాట్లాడుతూ, రాజకీయ ముసుగులో ఉపాధ్యాయులపై చేసిన దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉపాధ్యాయులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

రాజకీయ ముసుగులో వారు ప్రవర్తించిన తీరు ఉపాధ్యాయులపై చేసిన ఆరోపణలు మరియు ఉపాధ్యాయులను నీచాతి నీచంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన తీరు చాలా బాధాకరం అన్నారు. గత రెండు నెలలుగా వారు చేసిన ఆరోపణలకు అధికారులు పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగిందన్నారు.

అయినప్పటికీ ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు నల్లమల రామాంజులు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో కొన్ని మార్పులు చేసి ఉపాధ్యాయులపై దాడి చేసిన వారికి కఠిన శిక్షలు అమలు అయ్యే విధంగా చట్టాలలో మార్పులు తీసుకురావాలన్నారు.

ఈ సమావేశంలో పకీర, నాగరాజు, పీరయ్య, రామ నాయుడు, రాజేంద్ర నాయుడు, రెడ్డయ్య రాజు, మధుసూదన రెడ్డి, రమేష్ రాజు, వెంకటరామరాజు, రాచయ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI