Vijayawada: ఏపీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారం!
Vijayawada: ఏపీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
Vijayawada: ఏపీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారం!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ (ఎపిఇఆర్సి)చైర్ పర్సన్ గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 3వతేదీన జిఓఎంఎస్ సంఖ్య 87 ద్వారా ఎపిఇఆర్సి చైర్ పర్సన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ (Binoy Kumar)ను నియమించడంతో గురువారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ బినోయ్ కుమార్ తో చైర్ పర్సన్ గా ప్రమాణం చేయించారు. కార్యక్రమం అనంతరం ఈరోజు వారు శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేసి ఉన్నారు వారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ మరియు ఏఈఓ రమేష్ బాబు దర్శన ఏర్పాట్లు చేసి ఉన్నారు.




