Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్!
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకృతమైన కనకదుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్. ప్రత్యేక పూజలు.
Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్!
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ మంగళవారం దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి పైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్
అమ్మవారి అంతరాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు గవర్నర్ కు వేదాశీస్సులు అందజేశారు. ఆయనకు దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ కె. రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్ తదితరులు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.




