Vijayawada: క్రైస్తవులపై ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దు!

Vijayawada: విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఏపీ క్రిస్టియన్ సొసైటీ నేతలు. విజయసాయిరెడ్డి, ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం, హెచ్చరిక.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 5 Oct 2026 5:51 PM IST
Vijayawada
X

Vijayawada: క్రైస్తవులపై ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దు!

Vijayawada: క్రైస్తవ సమాజం భారతదేశ నిర్మాణానికి స్వతంత్ర పోరాటం నుండి విద్య వైద్య సామాజిక సేవలో ఎనలేని సేవలు చేసిన చరిత్ర ఉందని అది మరిచిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మతవిద్వేషాలు రెచ్చగొట్టే దృష్టితో ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ క్రైస్తవ సమాజం పై బలవంతపు మతమార్పిడిగా ప్రస్తావిస్తున్నారని, క్రైస్తవ మైనార్టీలపై ఆధారాలు లేని ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ అరుల్ అరుసు,అధ్యక్షుడు కుంపట్ల జేమ్స్ కోరారు.

సోమవారం విజయవాడ గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి, ఏబీఎన్‌ రాధాకృష్ణ క్రైస్తవ మతంపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

2017లో 1.3 శాతంగా ఉన్న క్రైస్తవ జనాభా 2024 నాటికి 5.7 శాతానికి పెరిగిందని, ఐదేళ్లలో చర్చిల నిర్మాణాలు 36 శాతం పెరిగాయని విజయసాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయనకు చిత్తశుద్ధి ఉంటే చెల్లుబాటయే ఆధారాలతో చర్చలు జరిపి నిరూపించాలని లేనిపక్షంలో కోర్టులో దావా తప్పదని హెచ్చరించారు.

సెప్టెంబర్ 25 ఆంధ్రజ్యోతిలో ఏబీఎన్ రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు దక్షిణాది రాష్ట్రాలలో మతమార్పిడి పెరిగిపోయిందని, ప్రధానమంత్రి బాదన వ్యక్తం చేసినట్లుగా ,తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ బాధ్యతలు తీసుకున్నప్పుడు నుండి ప్రభుత్వాన్ని చర్చిలు నడిపిస్తున్నట్లు, జగన్ మోహన్ రెడ్డి తమకు వచ్చే ఆదాయం ఎక్కువ భాగం మత మార్పిడికి,చర్చి నిర్మాణాలకు దానం చేస్తున్నారని, సిలువ ధరించిన వారికే పదవులు ఇస్తున్నారని కల్పిత కథనాలు టీవీలలో పెద్ద ఎత్తున డిబేట్లు నిర్వహించి మతకలహాలకు తెర లేపుతున్నారని ఇటువంటి అసత్య ప్రచారాలను ఏ.బీ.ఎన్ రాధాకృష్ణ మానుకోవాలని ధ్వజమెత్తారు.

2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుండే మత రాజకీయాలకు తెరతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ వర్గాల మధ్య మత యుద్ధాల లక్ష్యంగా పరిస్థితులు ఉన్నాయని ,విభేదాలు పెంచే వ్యాఖ్యలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ బీసీ మరియు ఎఫ్.సి కమ్యూనిటీ వర్గాల నుంచి బాప్తిసం పొంది, 18 ఏళ్లు పైబడిన క్రైస్తవులు స్వచ్ఛందంగా ఆన్‌లైన్‌లో క్రిస్టియన్ మైనారిటీ జాబితాలో ఎన్యూ మారేషన్ చేసుకోవాలని కోరారు.

ఎస్సీ ఎస్టీ బీసీ ఈసీ వర్గాల నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు చట్టబద్ధ ప్రయోజనాలు,రిజర్వేషన్ల అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన గెజిట్‌ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సి.హెచ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.