Vijayawada: ఆంధ్ర లయోలా కళాశాలలో ఘనంగా 'స్ఫూర్తి 2K26' బ్యానర్ ఆవిష్కరణ!
Vijayawada: విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో 'స్ఫూర్తి 2K26' సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు అక్టోబర్ 1 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.
Vijayawada: ఆంధ్ర లయోలా కళాశాలలో ఘనంగా 'స్ఫూర్తి 2K26' బ్యానర్ ఆవిష్కరణ!
Vijayawada: ఆంధ్ర లయోలా కళాశాల (అటానమస్), విజయవాడ ఆధ్వర్యంలో “స్ఫూర్తి 2K26” సాహిత్య, సాంస్కృతిక ఉత్సవం “Ignite – Unleash the Colours Within” అనే థీమ్‌తో ఘనంగా నిర్వహించబడుతోంది. విద్యార్థుల్లోని సాహిత్య, కళా, సాంస్కృతిక ప్రతిభను వెలికితీసేందుకు డిబేట్, ఎలోక్యూషన్, వ్యాసరచన, స్పాట్ ఫోటోగ్రఫీ, ఫేస్ పెయింటింగ్, శాస్త్రీయ నృత్యం తదితర పోటీలు నిర్వహిస్తున్నారు.
ఉత్సవంలో భాగంగా స్ఫూర్తి 2K26 బ్యానర్‌ను నేడు కళాశాల బ్రిడ్జి వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల రెక్టర్ రెవ. ఫాదర్ జి. రాయప్ప SJ, ప్రిన్సిపాల్ రెవ. ఫాదర్ డా. ఎస్. మెల్కియర్ SJ, ద్వితీయ సంవత్సరం UG వైస్ ప్రిన్సిపాల్ మరియు కన్వీనర్ రెవ. ఫాదర్ ఎం. అరుల్ జ్యోతి, విద్యార్థి కార్యకలాపాల డీన్ డా. ఎ. శ్రీలక్ష్మి, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ డీన్ డా. ఎన్. ఎ. ఫ్రాన్సిస్ జేవియర్, ప్రథమ సంవత్సరం UG వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి బి. శివకుమారి, అసోసియేషన్ స్టాఫ్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
2026 అక్టోబర్ 1న స్ఫూర్తి 2K26 ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ శ్రీ చ. కుటుంబరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే అనకాపల్లి సినిమా బృందం కూడా ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేయనుంది. ఇందులో హీరో లగడపాటి విక్రమ్ సహిదేవ్, హీరోయిన్ సంధ్య వశిష్ట, హీరో తండ్రి, చిత్ర దర్శకుడు మరియు నిర్మాత పాల్గొననున్నారు.
స్ఫూర్తి 2K26లో భాగంగా వెస్ట్రన్ డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్, జానపద నృత్యం, ఫ్లవర్ అరేంజ్‌మెంట్, క్విజ్ ఫైనల్స్ తదితర పోటీలు కూడా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి 2026 అక్టోబర్ 3న జరిగే ముగింపు (వాలెడిక్టరీ) కార్యక్రమంతో ఘనంగా ముగింపు పలకనున్నారు.




