Vijayawada: 16 ఏళ్లుగా అధికారుల వేధింపులు ఎదుర్కొంటున్నాను: AEE నాగసాయి!
Vijayawada: విజయవాడ ప్రెస్ క్లబ్‌లో పంచాయతీరాజ్ శాఖ AEE పూచ్చా వెంకట నాగసాయి మీడియా సమావేశం. 16 ఏళ్లుగా అధికారుల వేధింపులతో జీతం, ఇంక్రిమెంట్లు కోల్పోయానని ఆవేదన.
Vijayawada: 16 ఏళ్లుగా అధికారుల వేధింపులు ఎదుర్కొంటున్నాను: AEE నాగసాయి!
Vijayawada: 16 సంవత్సరాలుగా ఉన్నతాధికారుల వేధింపులు గురి చేస్తున్నారని పూచ్చా వెంకట నాగసాయి తెలిపారు . సోమవారం గాంధీనగర్ విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖలో ఏ.ఈ.ఈ.గా, నూజివీడు డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు,గతంలో రూరల్ వాటర్ సప్లై, శానిటేషన్ శాఖలో ఏఈఈగా పనిచేశానని, అనంతరం పంచాయతీరాజ్ శాఖకు బదిలీ/విలీనం అయినట్లు తెలిపారు.పాత శాఖ అధికారులు తనకు రిలీవింగ్ ఆర్డర్, LPC (Last Pay Certificate), SRలో అప్డేటెడ్ ఎంట్రీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఈ సమస్యల కారణంగా 16 ఏళ్లుగా జీతం, సర్వీస్ ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లు పొందలేకపోతున్నానని తెలిపారు.
రెండు శాఖల మధ్య సమస్యల కారణంగా తనకు 18 ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయని పేర్కొన్నారు.ప్రస్తుతం నూజివీడు కార్యాలయంలో కూడా జీతం నిలిపివేశారని ఆరోపించారు.తాను కార్యాలయానికి హాజరవుతూ ఏ.పీ.ఎఫ్.ఆర్.ఎస్ లో అటెండెన్స్ నమోదు చేస్తున్నప్పటికీ, తన హాజరును పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు.తన ఎంప్లాయిస్ ఐడి/ట్రెజరీ రికార్డుల విషయంలో కూడా సమస్యలు సృష్టించారని తెలిపారు.నూజివీడు కార్యాలయంలో తనకు ఫైల్స్, పని కేటాయించకుండా, తన అధికారిక ఆర్డర్లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కార్యాలయంలో కాంట్రాక్టర్ల బిల్లులు, శాతం,పర్సంటేజీల వ్యవహారాలపై తాను ఫిర్యాదులు చేసినందుకు గాను తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.ఒక జూనియర్ అసిస్టెంట్ తనపై దాడికి ప్రయత్నించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపారు.
తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని ,తనపై ఉన్న పాత శాఖకు సంబంధించిన చర్యలు,విచారణలు ముగిసిపోయినప్పటికీ, వాటిని చూపిస్తూ ఇప్పటికీ తనను వేధిస్తున్నారని తెలిపారు.తన సమస్యలపై కలెక్టర్, శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.తాను విజిలెన్స్ అధికారులకు శాఖలో జరుగుతున్న అక్రమాలు,అవకతవకలపై ఫిర్యాదు చేశానని తెలిపారు.
ఆ ఫిర్యాదుల తర్వాతే తనపై మరింత కక్ష సాధింపు జరిగి జీతం నిలిపివేశారని ఆరోపించారు. ముఖ్యంగా, జీతం విడుదల చేయాలంటే ₹30,000 ఇవ్వాలని, కోర్టు కేసులు, విజిలెన్స్‌కు ఇచ్చిన ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని తీవ్రతలు చేస్తున్నట్లు తెలిపారు.తనకు రావాల్సిన 18 ఇంక్రిమెంట్లు, నిలిచిపోయిన జీతం, సర్వీస్ రికార్డులు, ఎస్.ఆర్/ఎల్.పి.సి తదితర ప్రయోజనాలు వెంటనే కల్పించాలని 16 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న తనకు ప్రభుత్వం, అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.




