Burning Topic: ఇరాక్ నుంచి అమెరికా సైన్యం వెనక్కి..! ఇక ఇరాక్ పరిస్థితి ఏంటి?
Burning Topic: ఇరాక్‌లో రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన అమెరికా సైనిక ఉనికి అధికారికంగా ముగిసింది. దళాలను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు పెంటగాన్ వెల్లడించింది.
Burning Topic: ఇరాక్ నుంచి అమెరికా సైన్యం వెనక్కి..! ఇక ఇరాక్ పరిస్థితి ఏంటి?
Burning Topic: ఇరాక్‌లో అమెరికా సైనిక అధ్యాయం ముగింపు దశకు చేరుకుంది. ఇస్లామిక్ స్టేట్. ఉగ్రవాద సంస్థను అణచివేయడమే లక్ష్యంగా కొనసాగిన ఈ మిషన్ ముగిసిందని అగ్రరాజ్యం వెల్లడించింది. రెండు దశాబ్దాలకు పైగా ఆ దేశంలో కొనసాగిన అమెరికా సైనిక ఉనికికి సెప్టెంబర్ చివరి నాటికి ముగిసింది ఇర్బిల్ వైమానిక స్థావరంలోని చివరి బృందం అమెరికాకు బయలు దేరింది. ముగిసింది. సైనికుల ఉపసంహరణ విజయవంతంగా పూర్తయిందని పెంటగాన్ వెల్లడించింది. ఇక ఇరాక్ భద్రతకు ఆ దేశ బలగాలే ప్రధాన బాధ్యత వహించనున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఇరాన్‌తో అమెరికా సాధారణ ద్వైపాక్షిక భద్రతాపరమైన సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అమెరికా సైన్యం పూర్తిగా వెళ్లిపోవడాన్ని పురస్కరించుకుని ఇరాక్ ప్రభుత్వం 4 రోజుల పాటు అధికారికంగా "ఇరాక్ సార్వభౌమాధికార ఉత్సవాలు" గా ప్రకటించింది. అయితే, దౌత్యవేత్తల రక్షణ కోసం కేవలం స్వల్ప సంఖ్యలో దళాలు మాత్రమే అక్కడ ఉంటాయి.
కాగా అమెరికా సైన్యం ఒకేసారి నిరంతరంగా 23 ఏళ్లు అక్కడ లేదు. అగ్రరాజ్యం విడతలుగా ఇరాక్‌లో భారీ మిషన్లు నిర్వహించింది. ఇరాక్ దగ్గర సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయనే నెపంతో 2003లో అమెరికా ఆ దేశం మీద దాడి చేసింది. నాటి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను అధికారంలో నుంచి దించేసింది. అనంతరం పారిపోయిన రహస్య స్థావరంలో దాక్కున్న సద్దాం హుస్సేన్ 2003 డిసెంబర్ 13న పట్టుబడ్డారు. విచారణ తర్వాత 2006 డిసెంబర్ 30న ఆయన్ని ఉరి తీశారు. అనంతరం అమెరికా దళాలు అక్కడే సుదీర్ఘకాలం మకాం వేసి తిరుగుబాటు దళాలతో పోరాడాయి. సద్దాం పతనం తర్వాత ఇరాక్‌లో తీవ్రమైన రాజకీయ శూన్యత ఏర్పడింది. అక్కడ షియా, సున్నీ ముస్లిం వర్గాల మధ్య తీవ్ర అంతర్యుద్ధం మొదలైంది. శాంతిభద్రతలను కాపాడటానికి, కొత్తగా ఏర్పడిన ఇరాక్ ప్రభుత్వానికి మద్దతుగా అమెరికా బలగాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. అనంతరం 2011 చివరిలో అమెరికా తన దళాలను ఉపసంహరించుకుంది.
అమెరికా సైన్యం వెళ్లిన మూడేళ్లకే, ఇరాక్, సిరియా దేశాల్లో 'ఇస్లామిక్ స్టేట్') ఉగ్రవాద సంస్థ పుంజుకుని మోసుల్ వంటి ప్రధాన నగరాలను ఆక్రమించింది. ISIS సృష్టించిన మారణహోమాన్ని తట్టుకోలేక, ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా అమెరికా సహాయాన్ని కోరింది. దీనితో 2014లో అమెరికా ఆధ్వర్యంలో అంతర్జాతీయ కూటమి మళ్లీ ఇరాక్‌లో ప్రవేశించింది. 2017 నాటికి ISISను సైనికంగా ఓడించినప్పటికీ, వారి స్లీపర్ సెల్స్ మళ్లీ పుంజుకోకుండా చూడటానికి,ఇరాక్ స్థానిక సైన్యానికి శిక్షణ, నిఘా సమాచారం అందించడానికి దాదాపు 2,500 మంది అమెరికా సైనికులు ఇరాక్ బేస్‌లలో ఉండిపోయారు. ఐసిస్ బలహీనపడటంతో అమెరికా బలగాల ఉపసంహరణకు 2024లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో ఒప్పందం కుదిరింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తోంది.
ఇరాక్‌లో రెండు దశాబ్దాలకు పైగా సాగిన యుద్ధంలో 4,500 మంది అమెరికన్లు మరణించారు. దీంతో తమ బలగాల ఉపసంహరణను "నరకంలోకి చేసిన అత్యంత ఖరీదైన విహారయాత్ర ఎట్టకేలకు ముగిసింది" అని వ్యాఖ్యానించారు ట్రంప్. తనకు ఇరాక్‌లో బలగాలను ఉంచాలా లేదా ఉపసంహరించుకోవాలా అనే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, అయితే ఎటువంటి సందేహం లేకుండా తిరిగి వచ్చేయాల్సిన సమయం ఆసన్నమైందని భావించినట్లు పేర్కొన్నారు. గతంలో తీసుకున్న కొన్ని తప్పుడు రాజకీయ నిర్ణయాల వల్లే అమెరికా సైన్యం ఇరాక్ అనే ఊబిలో ఇన్నేళ్లపాటు కూరుకుపోవాల్సి వచ్చిందని ట్రంప్ విమర్శించారు. ఈ రోజు అమెరికాకు విజయం, ఇరాక్‌కు విజయం, అలాగే ఐసిస్ ఉగ్రవాద సంస్థపై లభించిన ఒక నిర్ణయాత్మక విజయం" అని ట్రంప్ ప్రకటించారు. తాము అసలు ఏ లక్ష్యంతో ఇరాక్‌లోకి ప్రవేశించామో, ఆ శత్రువు ఇప్పుడు పూర్తిగా నాశనమైందని ఆయన స్పష్టం చేశారు.
కాగా అమెరికా సైనిక ఉనికికి ముగింపు పలకడాన్ని ఇరాక్‌లో చాలామంది స్వాగతిస్తున్నప్పటికీ.. దేశ భద్రతను పూర్తిగా స్వయంగా నిర్వహించే స్థాయికి ఇరాక్ చేరుకుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో అమెరికా వైదొలగడంతో భద్రతా శూన్యం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళనలున్నాయి. పూర్తి సార్వభౌమాధికారం ఇరాకీల ఆకాంక్షే అయినప్పటికీ.. బలగాల నిష్క్రమణతో ఏర్పడే ఖాళీపై భయం ఉందని ఆయన పేర్కొన్నారు.అమెరికా బలగాల నిష్క్రమణపై మరో పెద్ద ఆందోళన ఐసిస్ విషయంలోనే. దాదాపు దశాబ్దం క్రితం ఐసిస్ తన ‘ఖలీఫత్’ను కోల్పోయినా.. ఆ సంస్థకు ఇప్పటికీ స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఇరాక్, కుర్దిష్ భద్రతా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇరాన్‌తో కూడా ఇరాక్‌కు ముప్పు పొంచి ఉంది. గత కొంత కాలంగా ఇరాన్ మీద దాడుల కోసం ఇరాక్‌ను స్థావరంగా వాడుకుంది అమెరికా. ఇప్పుడు అమెరికా సైన్యం వైదిలిగితే ఇరాక్ మీద ఇరాన్ దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ ఇరాక్ భూభాగం పరోక్ష పోరాట వేదికగా మారింది. 2020లో బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో అమెరికా జరిపిన దాడిలో ఇరాన్ కీలక కమాండర్ ఖాసెం సొలేమానీ మరణించారు. ఆ తర్వాత ఇరాన్ అనుకూల సాయుధ వర్గాలు ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై పలుమార్లు దాడులు చేశాయి. అమెరికా కూడా ప్రతీకార చర్యలకు దిగింది. ప్రస్తుత పరిణామాల్లోనూ ఇరాక్ పరిస్థితి సున్నితంగానే ఉంది. అమెరికా బలగాల నిష్క్రమణతో ఒకవైపు దేశ సార్వభౌమాధికారంపై చర్చ మళ్లీ తెరపైకి వస్తుండగా.. మరోవైపు ఇరాన్ అనుకూల మిలీషియాల ప్రభావం, ఐసిస్ ముప్పు, భద్రతా శూన్యం వంటి ప్రశ్నలు ఇరాక్ ముందున్నాయి. అమెరికా నేతృత్వంలోని కూటమి వెళ్లిపోవడం వల్ల ఇరాక్‌లో ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకునే సైనిక సమతుల్యత తొలగిపోతుందని.




