Burning Topic: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం!
Burning Topic: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు. భారీగా నష్టపోయిన అమెరికా సైన్యం, హర్మూజ్ జలసంధిపై కొనసాగుతున్న ఆధిపత్య పోరు.
Burning Topic: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం!
Burning Topic: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరిన వేళ అమెరికా-ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు దాదాపు సంక్షోభంలో పడ్డాయి. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం, చమురు రవాణా నౌకలపై దాడులు అమెరికా విధించిన కఠినమైన నౌకాదళ దిగ్బంధం సంక్షోభాన్ని తీవ్రం చేస్తున్నాయి.
ఈ భౌగోళిక రాజకీయ యుద్ధం కేవలం రెండు దేశాల సరిహద్దులకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ భద్రతను కుదిపేస్తోంది. ఇరుపక్షాల మధ్య శాంతి ఒప్పందాల కొరకు పరోక్ష చర్చలు జరుగుతున్నప్పటికీ, పరస్పర దాడుల హెచ్చరికలు పశ్చిమాసియాను మరో భారీ యుద్ధ ముంగిట్లోకి నెడుతున్నాయి.
అమెరికా, ఇరాన్ నాయకుల మధ్య కొనసాగుతున్న సవాళ్లు-ప్రతిసవాళ్లు ఈ యుద్ధాన్ని మరింత క్లిష్టతరంగా మారుస్తున్నాయి. అటు అణు కార్యక్రమాల నియంత్రణపై అమెరికా పెడుతున్న ఒత్తిళ్లు, ఇటు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడులతో మొదలైన యుద్ధం అనేక ములుపులు తిరగుతున్నాయి. తీరా లెక్కలు తీస్తే అమెరికా సాధించింది ఏమీ లేకపోగా నష్టం అపారంగా జరిగిందని స్పష్టమవుతోంది. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది.
ఇది దాదాపు రూ.31 వేల కోట్లు ఉంటుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా సైన్యం 81 సైనిక విమానాలను కోల్పోయింది. వీటిలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలైన F-35A లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్, 12 F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ వంటివి కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి రూ.289 కోట్ల విలువైన నాలుగు F-15 జెట్లు సైతం ధ్వంసమయ్యాయి.
సెప్టెంబర్ 9-10 తేదీలలో జోర్డాన్‌లోని మువఫ్ఫాక్ సాల్టి ఎయిర్ బేస్‌పై ఇరాన్ జరిపిన వైమానిక దాడులలో మరో ఎనిమిది F-15E జెట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే వాటికి మరమ్మతులు చేసి.. తిరిగి సేవలోకి తీసుకువచ్చినట్లు అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి.
ఈ ఉద్రిక్తతల వేళ ఇటీవల అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లోని కీలకమైన రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫెయిర్‌ఫోర్డ్ స్థావరం నుంచి తమ బి-1 బాంబర్లన్నింటినీ వెనక్కి తరలించింది. ఇరాన్ ముప్పు ఉందన్న సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
సెప్టెంబర్ 27న స్థావరానికి సమీపంలో ఐదుగురు యువకులను ఉగ్రవాద చర్యలకు సన్నాహాలు చేస్తున్నారన్న అనుమానంతో పోలీసులు అరెస్టు చేశారు. వారి వాహనాల్లో పేలుడు పదార్థాలు లభించకపోయినా కొంత పెట్రోల్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. తొలుత వాళ్లు ఇరాన్ ఏజెంట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత వారిని బెయిల్‌పై విడుదల చేశారు. మరో యూకే-ఇరాన్ ద్వంద్వ పౌరుడిని కూడా అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. ఈ పరిణామాల తర్వాత బాంబర్లను అమెరికాలోని స్వదేశీ స్థావరాలకు తరలించారు.
మరోవైపు అలాగే ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి తర్వలోనే ముగింపు పలుకుతామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇది మంచి మార్గంలో ముగుస్తుందా? లేక కఠిన చర్యల ద్వారా ముగింపు పలుకుతామా అనేది త్వరలోనే తేలుతుందని వ్యాఖ్యానించారు. ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు.
హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం విధిస్తున్న ఆంక్షలపై ట్రంప్ మాట్లాడారు. ఇలాంటి దిగ్బంధాన్ని ప్రపంచం ఇంతకుముందెన్నడూ చూడలేదన్నారు. ఇరాన్ వైపు ఎలాంటి నౌకలు వెళ్లకుండా సముద్ర మార్గాన్ని కట్టుదిట్టంగా నియంత్రిస్తున్నామని చెప్పారు. చమురు లేకుండా ప్రయాణించే నౌకల విషయంలో మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు హర్మూజ్ జలమార్గం తమదేని, ఇది పూర్తిగా అమెరికా నియంత్రణలోనే ఉంటుందని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో కూడా స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఇరాన్ నాయకత్వం మీద అమెరికా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టెహ్రాన్‌లో అసలు నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో స్పష్టంగా తెలియడం లేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో అమెరికా చర్చలు జరుపుతోందని తెలిపారు.
అయితే, దేశంలో వాస్తవంగా నిర్ణయాలు తీసుకునే అధికారం వీరికి ఎంతవరకు ఉందో స్పష్టంగా తెలియడం లేదని అన్నారు. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో నిర్ణయాలు ఎవరు?.. ఎలా తీసుకుంటారో పూర్తిగా అర్థం చేసుకోవడం అమెరికాకు సవాలుగా మారిందని వాన్స్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో చర్చలు, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై అమెరికా ముందుకు వెళ్తున్నప్పటికీ.. ‘అతిపెద్ద సమస్య ఏమిటంటే.. ఇరాన్‌ను ఎవరు నడుపుతున్నారో ఎవరికీ తెలియదు’ అని వ్యాఖ్యానించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ విషయంలోనూ అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. యుద్ధం సమయంలో ఆయన ప్రజల ముందుకు రాకపోవడం, ప్రస్తుత పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇరాన్ మాత్రం వ్యాఖ్యాలను తప్పుబడుతోంది.
మొజ్తబా ఖమేనీనే దేశ సుప్రీం లీడర్‌గా కొనసాగుతున్నారని స్పష్టం చేస్తోంది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అమెరికా వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అమెరికా అధికారులకు తమ ఇరానియన్ ప్రతినిధులు ఎవరన్నది, దేశ నిర్ణయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్నది తెలుసని చెప్పారు.
అసలు సమస్య ఇరాన్లో నాయకత్వం లేదా నిర్ణయ వ్యవస్థలో లేదని.. అమెరికా అధికారుల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు, గందరగోళమైన సందేశాలేనని ఆయన ఆరోపించారు. కాగా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ తన అణు కార్యక్రమంపై తీసుకోవాల్సిన నిర్ణయం కీలకంగా మారింది.




