Burning Topic: కొడుకు ప్రియురాలిపై ట్రంప్ సీరియస్ యాక్షన్!
Burning Topic: తీవ్ర అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో గ్రీస్‌లో అమెరికా రాయబారి కింబర్లీ గిల్‌ఫాయిల్ వైట్‌హౌస్ ఆదేశాలతో హఠాత్తుగా రాజీనామా చేశారు.
Burning Topic: కొడుకు ప్రియురాలిపై ట్రంప్ సీరియస్ యాక్షన్!
Burning Topic: అమెరికా మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు, గ్రీస్‌లో అమెరికా రాయబారి కింబర్లీ గిల్‌ఫాయిల్ ఎదుర్కొన్న తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో హఠాత్తుగా పదవి నుంచి వైదొలగాల్సి రావడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.
వైట్ హౌస్ ఒత్తిడి కారణంగా కింబర్లీ గిల్‌ఫాయిల్ తన పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించినప్పటికీ, ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఆమెను రాజీనామా చేయాలని స్పష్టంగా ఆదేశించింది. డొనాల్డ్ ట్రంప్ టీమ్‌లో క్రియాశీలకంగా పని చేసి, ఆయన పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్‌కు కాబోయే భార్యగా కూడా ప్రచారం పొందిన కింబర్లీ గిల్‌ఫాయిల్ దౌత్య ప్రస్థానం చివరకు వివాదాలతో ముగిసింది. ఇది అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
గ్రీసు దేశంలో అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించిన కింబర్లీ గిల్‌ఫాయిల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. రాయబారిగా తన హోదాను దుర్వినియోగపరచి అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారన్న కారణంగా అమెరికా ప్రభుత్వం రాజీనామా కోరడంతో ఆమె పదవి నుంచి వైదొలిగారు. పదవీకాలానికి ముందు, పదవిలో ఉండగా అనుచిత, అక్రమ ప్రవర్తనకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆమె నుంచి రాజీనామా కోరినట్టు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పేర్కొంది.
తన క్రెడిట్ కార్డు చెల్లింపుల కోసం ట్రంప్ అనుచరుడైన ఒక వ్యక్తి నుంచి లక్షడాలర్లు తీసుకొని అందుకు తగిన రీతిలో అధికారిక సాయం అందిస్తానని భరోసా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రముఖ గ్రీకు వ్యాపార వేత్తలు ఏర్పాటు చేసిన అత్యంత ఖరీదైన విమానాల్లో తాను ప్రయాణం చేసినట్టు ఆమె స్వయంగా చెప్పుకొన్న ఆడియో రికార్డులు కలకలం సృష్టించాయి. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం గిల్ ఫాయిల్ పదవిని దుర్వినియోగపరిచారనే ఆరోపణలున్నాయి.
గ్రీస్‌లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న కింబర్లీ గిల్‌ఫాయిల్ అమెరికా ప్రభుత్వంలోని కీలక అధికారులతో పరిచయాలు కల్పిస్తానంటూ ఓ సంపన్న మద్దతుదారుడిని తన క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె వ్యవహారంపై సెప్టెంబర్ చివరి నుంచి వాల్‌స్ట్రీట్ జర్నల్ వరుస కథనాలు ప్రచురించింది. గ్రీకు ఇంధన సంస్థకు చెందిన లాబీయిస్ట్తో గిల్ఫాయిల్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ వ్యాపార ప్రయోజనాలను ప్రోత్సహించారని ఆరోపించింది.
ప్రైవేటు దౌత్య సమావేశాలకు ఆ లాబీయిస్ట్‌ను అనుమతించారన్న ఆరోపణలూ వెలువడ్డాయి. మఓ విందు సందర్భంగా అమెరికా కోరుకుంటే గ్రీకు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయగలదని గిల్‌ఫాయిల్ వ్యాఖ్యానించారని వార్తలు వచ్చాయి. గ్రీకు వ్యాపారవేత్తలతో విలాసవంతమైన పర్యటనలు, దావోస్‌లో జరిగిన కార్యక్రమానికి ఆహ్వానం పొందేందుకు ఆమె చేసిన ప్రయత్నాలపైనా వార్తలు వచ్చాయి.
కింబర్లీ గిల్‌ఫాయిల్ మీద వచ్చిన ఆరోపణల్లో అత్యంత తీవ్రమైనది క్రెడిట్ కార్డు బిల్లుకు సంబంధించినది. ట్రంప్ మద్దతుదారుడైన వ్యాపారవేత్త ఎరిక్ డీటర్స్ వెల్లడించిన వివరాలను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. గిల్‌ఫాయిల్ తన లక్ష డాలర్ల క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించాలని ఆయనను కోరినట్లు చెబుతున్నారు. ప్రతిఫలంగా ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను కలిసే అవకాశం కల్పిస్తానని వాగ్దానం చేశారని ఆరోపణలున్నాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలో కింబర్లీ గిల్ఫాయిల్ను రాజీనామా చేయాలని వైట్‌హౌస్ ఆదేశించింది. అయితే గిల్‌ఫాయిల్ న్యాయవాదులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆమె రాయబారిగా నామినేట్ కావడానికి ముందే నిర్వహించిన ప్రసంగాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన బకాయి పారితోషికమని వివరించారు. ప్రైవేటు విమానాల వినియోగంపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ప్రయాణాలకు ముందు విదేశాంగ శాఖ మార్గదర్శకాలు తీసుకున్నారని, నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని తెలిపారు.
కింబర్లీ గిల్ఫాయిల్పై వచ్చిన వరుస కథనాలను విలేకరులు ప్రశ్నించగా.. ఆమెను తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ విషయంలో తాము సంతోషంగా లేమని వ్యాఖ్యానించారు. మరోవైపు గిల్‌ఫాయిల్ ఎక్స్‌లో స్పందిస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. తన పేరు, ప్రతిష్ఠ, నిజాయితీని కాపాడుకునేందుకు న్యాయపరంగా పోరాడతానని పేర్కొన్నారు. ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో పట్ల తన గౌరవం, మద్దతు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
అంతకుముందు గ్రీస్ పర్యటనలో రూబియో ఆమెను సమర్థమైన రాయబారిగా అభివర్ణించారు. కాగా గిల్‌ఫాయిల్ వ్యవహారంపై విచారణ జరపాలని డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేసింది. ఇవన్నీ కొనసాగుతుండగానే గిల్‌ఫాయిల్ రాజీనామా చేయాలని ట్రంప్ కోరినట్లు వైట్‌హౌస్ కొత్త ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియా ధ్రువీకరించారు.
కాగా కింబర్లీ గిల్ఫాయిల్కి గతంలో రెండుసార్లు వివాహమైంది. 2001లో ప్రస్తుత కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2006లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది వ్యాపారవేత్త ఎరిక్ విలెన్సీని వివాహం చేకున్నా, 2009లో విడిపోయారు. ఆ తర్వాత గిల్‌ఫాయిల్ 2018లో తనకన్నా 9 ఏళ్ల చిన్నవాడైన డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ ప్రేమలో పడ్డారు. కింబ్లర్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరఫున క్రియాశీలకంగా పని చేశారు.
2020లో జూనియర్ ట్రంప్, గిల్ఫాయిల్ల ఎంగేజ్మెంట్ జరిగింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత 2024 చివరి నాటికి వీరిద్దరూ తమ బంధాన్ని ముగించారు. ఎన్నికల కారణంగా ఇబ్బంది కలగకుండా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కింబర్లీని గ్రీస్ దేశానికి అమెరికా రాయబారిగా నియమించి అక్కడికి పంపించారు. కాగా జూనియర్ ట్రంప్ వివాహం ఈ ఏడాది మేలో బెట్టినా ఆండర్సన్‌తో జరిగింది.
ఇదిలా ఉంటే వైట్‌హౌస్ కొత్త కొత్త ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియా తొలి మీడియా సమావేశం నవ్వులు పూయించింది. బాధ్యతలు చేపట్టిన రెండో రోజే మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె కేవలం 14 నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ట్రంప్ విభేదాలపై ప్రశ్నించగా కేటీ వెంటనే సమాధానం చెప్పలేకపోయారు. ఆ విషయం గురించి తెలుసుకుని తిరిగి సమాధానం చెబుతానన్నారు.
ఇక మీడియా ప్రతినిధులు కేటీ కుటుంబ బాధ్యతల గురించి మాట్లాడుతున్న సమయంలో ట్రంప్‌ను తన భర్తగా పేర్కొన్నారు. వెంటనే తన పొరపాటును గుర్తించినప్పటికీ, అప్పటికే మీడియా సమావేశంలో నవ్వులు వినిపించాయి. . తనకు నలుగురు పిల్లలు ఉన్నారని తెలిసినా, ఈ ఉద్యోగం ఎంత కష్టమైనదో తెలిసినా ట్రంప్ తనపై నమ్మకం ఉంచారని, ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలననే విశ్వాసం తనకు ఉందని కేటీ తెలిపారు.




