OFF THE RECORD: రేవంత్ మాస్టర్ ప్లాన్.. నేతలకు కొత్త టార్గెట్!
OFF THE RECORD: కోటి ఓట్లు, 90 సీట్లు, 15 ఎంపీ స్థానాల లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త నినాదం ప్రకటించారు. గాంధీ భవన్ PAC భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
OFF THE RECORD: రేవంత్ మాస్టర్ ప్లాన్.. నేతలకు కొత్త టార్గెట్!
OFF THE RECORD: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త నినాదం మారుమోగుతోంది. కోటి ఓట్లు.. 90 సీట్లు.. 15 ఎంపీ స్థానాలు. అవును.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన ఈ టార్గెట్ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గాంధీ భవన్ వేదికగా జరిగిన PAC సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీకి కొత్త మంత్రంలా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల దిశగా కేడర్‌ను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ నినాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.




