News Analysis: సీఎం రేవంత్ ఫెయిల్.. ఒక్క ఏడాదిలో 2,081 స్కూళ్లు క్లోజ్: బీజేపీ నేత మహేష్!
News Analysis: రేవంత్ రెడ్డి సర్కార్ విద్యా రంగంలో విఫలమైందని, ఒక్క ఏడాదిలోనే 2,081 స్కూళ్లు మూతపడ్డాయని బీజేపీ నేత మహేష్ విమర్శించారు. hmtv ప్రత్యేక చర్చలో వెల్లడించిన ముఖ్యాంశాలు.
News Analysis: సీఎం రేవంత్ ఫెయిల్.. ఒక్క ఏడాదిలో 2,081 స్కూళ్లు క్లోజ్: బీజేపీ నేత మహేష్!
News Analysis: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, విద్యా రంగంలో నెలకొన్న సమస్యలపై hmtv నిర్వహించిన ప్రత్యేక చర్చ (News Analysis) కొనసాగింది. ఈ చర్చలో బీజేపీ నాయకుడు మహేష్ పాల్గొని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగాన్ని గాలికొదిలేశారని, రాష్ట్రంలో ప్రభుత్వ బడుల సంఖ్య రోజురోజుకూ పడిపోతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో కేవలం ఒక్క అకాడమిక్ ఇయర్లోనే సుమారు 2,081 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని మహేష్ ఆరోపించారు. విద్యార్థులు లేకపోవడం (Zero Enrollment) మరియు ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ఏటా వేల సంఖ్యలో స్కూళ్లు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.




