Burning topic: 1955లో మరింత బలపడిన భారత్–రష్యా బంధం.. నేటికీ!
Burning topic: ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని కోరుతున్న వారిలో ప్రధాని మోడీ ముందున్నారన్న పుతిన్. భారత్-రష్యా సంబంధాలు, పుతిన్ వ్యాఖ్యల పూర్తి వివరాలు.
Burning topic: 1955లో మరింత బలపడిన భారత్–రష్యా బంధం.. నేటికీ!
Burning topic: భారత ప్రధాని నరేంద్ర మోడీపై రష్యా అధినేత పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించవలసిందిగా తమపై ఒత్తిడి తెచ్చినవారిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందు వరుసలో ఉన్నారన్నారు. వాస్తవానికి యుద్దాన్ని ముగించాలని తాను కూడా కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా రష్యా భద్రత కారణాల నేపథ్యంలో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగించక తప్పడం లేదని పుతిన్ వివరణ ఇచ్చారు. మాస్కోలోని వాల్దాయ్ ఫోరంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ పై కొనసాగుతున్న యుద్ధాన్ని పుతిన్ ప్రస్తావించారు.
కాగా భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ఒక గొప్ప ప్రతీక అని పుతిన్ పేర్కొన్నారు. భారతదేశ కల్చరల్ యూనిటీ, ఐక్యత మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ లో 60 కోట్ల మంది హిందీ మాట్లాడతారన్నారు.మిగతా వారు..తమ తమ ప్రాంతీయ భాషలు మాట్లాడతారన్నారు. అయినప్పటికీ, వారంతా ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి ఉంటారని పుతిన్ వెల్లడించారు. నిజంగా ఇదొక అద్భుతమని పుతిన్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని విశ్వగురుగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల్లో భారత్ తటస్థ వైఖరి అవలంబించడం గొప్ప విషయమని అన్నారు. వాస్తవానికి రష్యాతో భారత్ కు అనేక సంవత్సరాలుగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో అటు రష్యాతోనూ ఇటు ఉక్రెయిన్ తోనూ భారత్ సమాన దూరం పాటిస్తోందని పుతిన్ వెల్లడించారు.
అయితే అనేక అంతర్జాతీయ వేదికలపై భారత ప్రధాని నరేంద్ర మోడీతో తాను సమావేశమవుతుంటానని పుతిన్ తెలియచేశారు. కాగా మొదటగా ఉక్రెయిన్ పై యుద్ధానికి ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తున్నారంటూ తనను నరేంద్ర మోడీ ప్రశ్ని్స్తుంటారని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలకు తాను థ్యాంక్స్ చెబుతున్నానన్నారు రష్యా అధినేత పుతిన్.
భారత్ - రష్యా అనుబంధం ఇప్పటిది కాదు. ఈ అనుబంధానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1947 ఏప్రిల్ నుంచే రెండు దేశాల మధ్య సత్సంబంధాలున్నాయి. ప్రధానంగా అమెరికా అప్పటి సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగినరోజుల్లో కూడా మాస్కోతో ఢిల్లీకి సత్సంబంధాలున్నాయి. అయితే సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలసిపోయిన తరువాత కూడా రష్యా - భారత్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే, 1955 నాటికి ఢిల్లీ - మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలు మరింతగా బలపడ్డాయి. అలీనోద్యమానికి చెందిన దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడానికి అప్పటి సోవియట్ యూనియన్ కొన్ని ప్రయత్నాలు చేసింది. దీని ఫలితంగా ఢిల్లీ - మాస్కో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడ్డాయి. ఇందులో భాగంగా 1955 జూన్ లో అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అలనాటి సోవియట్ యూనియన్ లో పర్యటించారు. దీనికి కొనసాగింపుగా 1955 ఏడాది చివరలో రష్యా నేత నికితా కృశ్చేవ్ భారతదేశంలో పర్యటించారు.
ఢిల్లీ, మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలను కొనసాగుతున్న క్రమంలో 1985 మే లో ప్రధాని హోదాలో మాస్కో పర్యటన చేపట్టారు రాజీవ్ గాంధీ. కాగా రాజీవ్ పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాజీవ్ గాంధీ చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే.
ఇదిలా ఉంటే 90ల్లో సోవియట్ యూనియన్ కాలగర్బంలో కలసిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ పటంపై సోవియట్ యూనియన్ అంతర్థానమైన తరువాత కూడా ఢిల్లీ - మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలే కొనసాగాయి. ఈ నేపథ్యంలో భారత్ - రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమైంది.
ఇదిలా ఉంటే యూరోపియన్ దేశాలపై దాడులు చేయడానికి రష్యా సిద్ధమవుతోందన్న వార్తలు ఇటీవల గుప్పుమంటున్నాయి.అయితే..ఈ వార్తలను రష్యా అధినేత పుతిన్ ఖండించారు. యూరోపియన్ దేశాలపై దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని పుతిన్ కుండబద్దలు కొట్టారు. అయితే ఉక్రెయిన్ విషయంలో ఉద్రిక్తతలను పెంచడాన్ని యూరోపియన్ దేశాలు మానుకోవాలన్నారు.
అయితే తమకు కీలకమైన కలినిన్ గ్రాడ్ సహా అనేక ఇతర రష్యా భూభాగాలపై యూరోపియన్ దేశాలు దాడులు చేస్తే తాము సహించే ప్రసక్తే లేదని పుతిన్ తెగేసి చెప్పారు. రష్యా భూభాగాలపై యూరోపియన్ దేశాలు దాడులు చేస్తే అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా తాము వెనకాడేది లేదని పుతిన్ హెచ్చరించారు.
2022 ఫిబ్రవరి 24 ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలు పెట్టిన రోజు. ఉక్రెయిన్‌పై సైనిక దాడులు ప్రారంభమై నాలుగేళ్లు దాటింది. అయితే ఉక్రెయిన్ ఇప్పటికీ రావణకాష్టంలా తగలబడుతూనే ఉంది. మధ్యమధ్యలో కొన్నిసార్లు స్పైడర్ వెబ్ సాయంతో రష్యా బలగాలపై పైచేయి సాధిస్తోంది. అయితే ఒకటిమాత్రం వాస్తవం.
ఉక్రెయిన్‌పై సైనిక దాడులు ప్రారంభించిన తొలిరోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడు మీద ఉన్నాడు. ఈ యుద్దంలో ప్రపంచ దేశాలేవీ జోక్యం చేసుకోకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. తన మాటను కాదని ఏ దేశమైనా జోక్యం చేసుకుంటూ తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని పుతిన్
సహజంగా ఉక్రెయిన్‌కు అమెరికాతో మంచి సంబంధాలున్నాయి. దీంతో అమెరికా జోక్యాన్ని కూడా నివారించడానికి ఈ ఎపిసోడ్లో మూడో దేశం ఎంట్రీని ఆయన తోసిపుచ్చారు. పరోక్షంగా అమెరికాకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పనిలోపనిగా అమెరికాతో పాటు నాటో కూటమి దేశాలకు కూడా పుతిన్ హెచ్చరికలు జారీ చేశాడు.
పుతిన్ వార్నింగ్ సంగతి ఎలాగున్నా, ఈ ఏడాది జూన్ లోగా యుద్ధం ముగింపుపై ఓ నిర్ణయానికి రావాలని ఉభయ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ విధించారు.అయితే ట్రంప్ డెడ్ లైన్ ను పుతిన్ పట్టించుకోలేదన్నఆరోపణలున్నాయి.
వాస్తవానికి రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నాటో కూటమే కారణం అంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. 1991లో సోవియట్ యూనియన్ కాలగర్బంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. ఇందులో భాగంగా
ఉక్రెయిన్ ఒక స్వతంత్ర రిపబ్లిక్ గా కొనసాగుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. భద్రతాపరంగా రష్యా దేశానికి, ఉక్రెయిన్ రిపబ్లిక్ కీలకప్రాంతం. అయితే నాటో అనేది అమెరికా కనుసన్నల్లో నడిచే ఒక కూటమి. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు.
ఈ నేపథ్యంలో అమెరికా ఆధిపత్యంలో ఉన్న నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరుతుందన్న ప్రచారం అంతర్జాతీయ రాజకీయవర్గాల్లో వినిపించింది. అంతేకాదు నాటో సైనిక కూటమలో చేరాల్సిందిగా ఉక్రెయిన్ పై అమెరికా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు రష్యాకు స్పష్టమై సమాచారం అందిందంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.
మొత్తంమీద నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరడం ఖాయమన్న సమాచారం రష్యాకు అందింది. దీంతో రష్యా అప్రమత్తమైంది.నాటో కూటమిలో ఉక్రెయిన్ సభ్యదేశంగా చేరితే రష్యా భద్రత ప్రమాదంలో పడినట్లే భావించాలి. ఎందుకంటే నాటో కూటమిలో సభ్యదేశంగా ఎంట్రీ ఇస్తే...కథ వేరేగా ఉంటుంది. ఉక్రెయిన్ లో నాటో సైనిక దళాలు నిరభ్యంతరంగా ప్రవేశించవచ్చు.
అంతేకాదు సమీపాన ఉన్న రష్యాలోని ఏ ప్రాంతాన్ని అయినా లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ నుంచి నాటో బలగాలు క్షిపణులను ప్రయోగించే ప్రమాదం కూడా ఉంది. అంటే భద్రతా పరంగా రష్యా ప్రమాదంలో పడినట్లే భావించాల్సి ఉంటుంది. మొత్తంగా రష్యా - ఉక్రెయిన్ వివాదానికి మూలాలు పరోక్షంగా నాటో కూటమితో ముడిపడి ఉన్నాయంటారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు.
ఏమైనా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై నాలుగు సంవత్సరాలు దాటింది. నాలుగేళ్ల యుద్ధంలో అటు రష్యా ఇటు ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయాయి. ఉభయదేశాలకు చెందిన ఇరవై లక్షల మంది సైనికులు మరణించారు. మొదట్లో ఇరుదేశాల మధ్య సాగిన మాటల యుద్ధం, ఒకదశలో అణ్వస్త్ర యుద్ధం వస్తుందా అనే భయాందోళనలకు దారితీసింది. కాగా యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు తమ మొండి పట్టుదలను వీడకపోవడమే ఇందుకు కారణం.
అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే, ఇరవై నాలుగు గంటల్లో రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేలా చేస్తానని ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టి చాలాకాలం అయింది.
అయితే ఇప్పటికీ రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడలేదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత వినాశకర యుద్ధం ఇదే. నాలుగేళ్ల యుద్ధంలో అటు రష్యా ఇటు ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయాయి. ఉభయదేశాలకు చెందిన ఇరవై లక్షల మంది సైనికులు మరణించారు. మొదట్లో ఇరుదేశాల మధ్య సాగిన మాటల యుద్ధం, ఒకదశలో అణ్వస్త్ర యుద్ధం వస్తుందా అనే భయాందోళనలకు దారితీసింది.
కాగా ఉక్రెయిన్ లోని నాలుగో వంతు భూభాగాలను స్వాధీనం చేసుకుంది. ఆ భూభాగాల్లోని ప్రజలంతా రష్యా అధీనంలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకుని తీరాలి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం పరిసమాప్తి చేసే ప్రక్రియలో యూరోపియన్ దేశాలను డొనాల్డ్ ట్రంప్ దూరం పెట్టారు.
ట్రంప్ మహాశయుడు తీసుకున్న ఈ నిర్ణయం యూరప్ దేశాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. వాస్తవానికి అమెరికా-సోవియట్ యూనియన్ మధ్య జరిగిన పోటీతో యూరోపియన్ దేశాలకు అసలు సంబంధమే లేదు. అయినప్పటికీ అమెరికా దగ్గర మంచి మార్కులు వేయించుకునేందుకు తగుదునమ్మ అంటూ యూరోపియన్ దేశాలు తలదూర్చాయి.




