BURNING TOPIC: చైనా నుంచి భారత్ వైపు.. నేపాల్ మళ్లీ ఎందుకు దగ్గరవుతోంది?
BURNING TOPIC: న్యూఢిల్లీ పర్యటనలో నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో కలిసి ప్రధాని మోదీ 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇంధన ప్రాజెక్టులు, సరియు-కమలా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించారు.
BURNING TOPIC: చైనా నుంచి భారత్ వైపు.. నేపాల్ మళ్లీ ఎందుకు దగ్గరవుతోంది?
BURNING TOPIC: మన దేశంతో శతాబ్దాలుగా అత్యంత సాంస్కృతిక, చారిత్రిక బంధం ఉన్న పొరుగు దేశం నేపాలే. ఇరు దేశాల ప్రజల మధ్య రోటీ, భేటీ సంబంధ బాంధ్యవ్యాలు ఉన్నాయి భారత్‌తో తెరచి ఉండే సరిహద్దులను పంచుకునే నేపాల్‌కు ఎలాంటి కష్టమొచ్చినా తక్షణం ఆదుకోవాల్సింది మన దేశమే.. ఇరు దేశాల మధ్య భద్రత, వాణిజ్యం, ఇంధనం, రవాణా, పెట్టుబడుల పరంగా ఇరుపక్షాల బాంధవ్యం కొనసాగుతున్నాయి.
నేపాల్ ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, విపత్తు నిర్వహణ, నిత్యావసరాల సరఫరాలో భారత్ పాత్ర మరువలేనిది. కానీ కొన్నేళ్లుగా అక్కడి నాయకులు భారత్‌ను అనుమానంగానే చూస్తున్నారు. నేపాల్ రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం భారత వ్యతిరేకతను నూరిపోస్తున్నాయి. అయితే కష్టకాలంలో ఆదుకుంటున్న భారత్‌ను వారు వదులుకోలేని పరిస్థితులు సుస్పష్టం..
ఈ ఏడాది 2026 మార్చిలో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలేంద్ర షా భారత్‌ను తన తొలి ద్వైపాక్షిక పర్యటన గమ్యస్థానంగా ఎంచుకున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జరిగిన నేపాల్ ప్రధాని బాలేంద్ర షా 34 మంది అధికారుల బృందం, 52 మంది వ్యాపార ప్రతినిధులతో కలిసి రెండు రోజుల పర్యటన కోసం న్యూఢిల్లీకి వచ్చారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలపేతమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగింది.
హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, బాలేంద్ర షాలమధ్య జరిగిన సమావేశంలో ఎనిమిది అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు అంతరిక్ష సాంకేతికత, భద్రతా శిక్షణ, పౌర సేవల సామర్థ్య పెంపు, ఆరోగ్యం, సంప్రదాయ వైద్యం, పట్టణాభివృద్ధి, వ్యవసాయం వంటి రంగాల్లో సహకారానికి ఈ ఒప్పందాలు మార్గం సుగమం చేయనున్నాయి.
ఇటీవల నేపాల్‌లో మెరుపు వరదల కారణంగా దారుణంగా దెబ్బతిన్న ప్రాంతాల పునర్మిర్మాణం కోసం ప్రధాని మోదీ భారత్ తరపున 24 వేల రూపాయల నేపాలీ రూపాయల విలువైన ప్యాకేజీని ప్రకటించారు.
ఈ సందర్భంగా భారత్ సాయంతో నేపాల్‌లో పూర్తిచేసుకున్న రెండు ఇంధన ప్రాజెక్టులను మోదీ, బాలెన్ షా వర్చువల్‌గా ప్రారంభించారు. 669 మెగావాట్ల సామర్థ్యమున్న అరుణ్ హైడ్రో–ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇందులో ఉంది. మరో మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.
కీలక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగించాలని నేతలు నిర్ణయించారు. నేపాల్‌కు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. వికసిత్ భారత్, సమున్నత నేపాల్ పేరుతో దార్శనిక పత్రాన్ని ఆయన విడుదల చేశారు. మన రెండుదేశాల మధ్య ఉన్నది కేవలం బంధం కాదు.
బంధుత్వం. పొరుగుదేశాల మధ్య అచంచలమైన నమ్మకం శతాబ్దాలుగా కొనసాగుతోంది. గతంలో సంతోషాలను పంచుకున్నాం.ఇప్పుడు సవాళ్లను సమష్టిగా ఎదుర్కొందాం. ఒకరి అభివృద్ధిలో మరొకరం భాగస్వాములం. కష్టకాలంలో ఒకరినొకరం సాయంచేసుకున్నామని గుర్తు చేశారు ప్రధాని మోదీ.
భారత్‌తో చర్చలు విజయవంతంగా ముగిశాయని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆనందం వ్యక్తం చేశారు.. ఇరు దేశాల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆధునిక అవసరాలకు అనుగుణంగా విస్తరించుకోవడమే లక్ష్యమని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలతో పాటు వివిధ రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయని వివరించారు.ఈ ఒప్పందాలు, చేపట్టే ప్రాజెక్టులు భారత్-నేపాల్ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని బాలేంద్ర షా విశ్వాసం వ్యక్తం చేశారు. కష్టకాలంలో భారత్ ప్రతిసారీ నేపాల్‌ను అన్ని విధాలుగా ఆదుకుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి, భారతీయులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’అని నేపాల్ ప్రధాని షా వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య కంటోన్మెంట్ నుంచి నేపాల్‌లోని జనక్‌పుర్ ధామ్ వరకు నడిచే సరియు-కమలా ఎక్స్‌ప్రెస్ వారపు రైలును ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సంయుక్తంగా ప్రారంభించారు. ఈ రైలు సర్వీసుతో ఇరు దేశాల్లోని రెండు ముఖ్యమైన మతపరమైన ప్రాంతాల మధ్య ప్రయాణం సులభతరం కానుంది.
అయోధ్య, జనక్‌పుర్ ప్రాంతాలకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ సేవ కీలకంగా మారనుంది. ఈ రైలు ఇరుదేశాల మధ్య అనుసంధానాన్ని మాత్రమేకాదు ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి, రామాయణ సర్క్యూట్ అభివృద్ధిలో కీలకంగా మారుతుందని మోదీ అన్నారు.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాను నేపాల్‌లోని దార్చుల్లా జిల్లాను అనుసంధానిస్తూ కాళీ నదిపై కొత్తగా నిర్మించిన 110 మీటర్ల మోటార్ వంతెనను వర్చువల్‌గా మోదీ, బాలెన్ షా ప్రారంభించారు. కొత్త వంతెనతో నేపాల్ పౌరులు భారత్‌లోకి సులభంగా ప్రవేశించనున్నారు.
ఏడున్నర దశాబ్దాల మొదలైన భారత్, నేపాల్ శాంతి, స్నేహ ఒప్పందం 1990ల చివరి నాటికి తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. కేపీశర్మ ఓలి నేపాల్ ప్రధానిగా ఉన్న సంమయంలో చైనాకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలను నేపాల్‌లో అంతర్భాగాలుగా చూపించడం పెనుదుమారం రేపింది.
మరోవైపు కాఠ్‌మాండూ మేయర్‌గా ఉన్న సమయంలో బాలేంద్ర- భారత్‌లోని కొన్ని ప్రాంతాలతో కూడిన గ్రేటర్ నేపాల్ మ్యాప్‌ను ప్రదర్శించారు. ఆయన నేపాల్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీని కలిసేందుకు సమయం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.
అయితే చివరకు భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు బాలెన్‌షా మొగ్గుచూపారు. నేపాల్ ప్రయోజనాలే ప్రధానమంటూ చైనాతో సత్సంబంధాలను కొనసాగిస్తున్న బాలేన్- దేశ ఆర్థిక అవసరాలూ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే భారత పర్యటనకు విచ్చేశారు.
ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్లో భారత్‌తో ఘర్షణకు దిగితే నష్టపోతామని నేపాల్‌కు తెలుసు. ఇరాన్ మీద అమెరికా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత పెట్రోల్, డీజిల్ వంటగ్యాస్, ఎరువుల ధరలు ఆకాశాన్నంటడంతో నేపాల్‌లో ఆందోళనలు మొదలయ్యాయి.
అదే సమయంలో ఆకస్మిక వరదలతో ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది భారత్ సకాలంలో సహాయ సిబ్బందితోపాటు మందులు, ఆహారం, ఇతర వైద్యసామగ్రి పంపింది. ఆర్థిక సహాయం ప్రకటించింది. దీంతో భారత్ తోడ్పాటులేనిదే అడుగు ముందుకేయటం అసాధ్యమని నేపాల్‌కు అర్థమైంది.
నేపాల్ ఉత్పత్తుల గమ్యస్థానం మన దేశమే. అక్కడ ఉత్పత్తయ్యే సరుకులో 80 శాతం మనకే చేరుతుంది. నేపాల్ నుంచి ఏటా 1,200 మెగావాట్ల విద్యుత్ మన దేశం కొనుగోలు చేస్తుంది. పలు జలవిద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిలో భారత్ కంపెనీలదే ప్రముఖపాత్ర. మన సైన్యంలో నేపాల్‌కు చెందిన గూర్ఖాలకు ప్రాముఖ్యత ఉంటుంది.




