Special Interview: కమ్యూనిస్ట్ పార్టీలను అప్రతిష్టపాలు చేయాలనే ప్రభుత్వం చూస్తోంది: కే రామకృష్ణ

Special Interview: కమ్యూనిస్ట్ పార్టీలను అప్రతిష్టపాలు చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని సీపీఐ నేత కే రామకృష్ణ హెచ్‌ఎంటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Arun Chilukuri
Published on: 6 Oct 2026 12:59 PM IST
Special Interview
X

Special Interview: కమ్యూనిస్ట్ పార్టీలను అప్రతిష్టపాలు చేయాలనే ప్రభుత్వం చూస్తోంది: కే రామకృష్ణ

Special Interview: దేశంలో నక్సలిజం అణచివేత, కమ్యూనిస్ట్ పార్టీల రాజకీయ ప్రస్థానం మరియు కేరళ ప్రభుత్వాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ హెచ్‌ఎంటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలపై స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే కమ్యూనిస్ట్ పార్టీలను అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నాలు చేసిందని, చాలా మంది సీనియర్ నాయకులు లొంగిపోయారని రామకృష్ణ పేర్కొన్నారు. అయితే, అడవుల్లో పోరాడి సాధించేది ఏమీ లేదనే స్వానుభవంతోనే కొందరు బయటకు వచ్చారని తెలిపారు.

నక్సలిజాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యగా చూడకుండా.. అది సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యగా భావించి మౌలిక సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీలపై ఎప్పుడూ ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని స్పష్టం చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవేనని, కమ్యూనిస్టులను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఇలాంటి కేసులు పెడుతున్నారని విమర్శించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.