Burning Topic: ఎన్విడియా సీఈవో ఎపిసోడ్.. సినిమా స్టైల్లో బిగ్ ట్విస్ట్!

Burning Topic: వివాదాలతో రాజీనామా చేసిన రెండు వారాల్లోనే జెన్సన్ హువాంగ్ తిరిగి ఎన్విడియా సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Nov 2026 10:20 AM IST
Burning Topic
X

Burning Topic: ఎన్విడియా సీఈవో ఎపిసోడ్.. సినిమా స్టైల్లో బిగ్ ట్విస్ట్!

Burning Topic: గ్లోబల్ ఏఐ చిప్ దిగ్గజం ఎన్విడియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు, జాతీయ భద్రతా ఆరోపణల నడుమ రాజీనామా చేసిన రెండు వారాల్లోనే సంస్థ సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తిరిగి సీఈవోగా, ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

చైనా గూఢచారిగా అనుమానిస్తున్న అలీస్ హువాంగ్‌తో మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందని హువాంగ్‌ అంగీకరిస్తూ ఈనెల 11 తన పదవికి రాజీనామా చేశారు. నవంబర్‌ 12న ఆయన రాజీనామాను ఆమోదించిన బోర్డు, నవంబర్‌ 23న ఏకగ్రీవంగా పునర్నియామకానికి ఆమోదం తెలిపింది. కంపెనీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.

ఎన్వివిడియాను ముందుకు నడిపించడానికి జెన్సన్‌ సరైన వ్యక్తి అని వెల్లడించింది. జెన్సన్ హువాంగ్ పునర్నియామకం తమ వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములు, వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది.

తిరిగి సీఈఓగా వచ్చిన జెన్సన్ హువాంగ్‌కు ఎన్విడి ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయంలోకి ఆయన చేరుకోగానే. ‘జెన్సన్‌.. జెన్సన్‌’ అంటూ ఉద్యోగులు ఆయనకు చప్పట్లతో స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. ‘‘నాకు రెండో అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.

సీఈఓగా మరింత మెరుగ్గా పనిచేసేందుకు ప్రయత్నిస్తాను. మీ అందరినీ ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’’అని పేర్కొన్నారు. జెన్సన్‌ మాట్లాడుతోన్న సమయంలో ఓ మహిళా ఉద్యోగి ఆయనను కౌగిలించుకోవడంతో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇది నా మొదటి రోజు. నా దగ్గర కంప్యూటర్ కూడా లేదు. ఐటీ విభాగం నాకు కొత్త పీసీ ఇవ్వాల్సి ఉంటుంది’’ అంటూ జెన్సన్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఎన్విడియాలోకి జెన్సన్ హువాంగ్ తిరిగిరాక అంత తేలిగ్గా జరగలేదు. దీని వెనుక పెద్ద తంతంగమే నడింది. సీఈఓగా మళ్లీ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ ఇటీవల ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఆ సమయంలో ఈ ప్రతిపాదనను ఎన్విడియా బోర్డు తిరస్కరించింది. ఐతే అనూహ్యంగా ఇవాళ జెన్సన్ పునర్నియామకానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఈ తతంగం వెనుక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎన్విడియా కంపెనీ బోర్డు సభ్యులతో హువాంగ్ గంటల తరబడి సమావేశమయ్యారు. గతంలో వెలుగులోకి వచ్చిన మూడు సంబంధాలే కాకుండా తనకున్న ఇతర వివాహేతర సంబంధాలన్నింటినీ ఆయన బోర్డు ముందు నిజాయితీగా ఒప్పుకుని, తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తెలిపింది.

హువాంగ్‌ పునర్నియామకం కోసం అమెరికా అధ్యక్షుడు ఏకంగా తన పారిపాలన యంత్రాంగం మొత్తాన్నిరంగంలోకి దింపారు. దాదాపు మూడు రోజులు చర్చలు జరిపారు.

ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్ తిరిగి రాక వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ ఏఐ పోటీలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే ఎన్వివిడియా వంటి సంస్థల నాయకత్వంలో స్థిరత్వం అవసరమని ఆయన భావించారు.

ముఖ్యంగా చైనాతో సాంకేతిక, ఆర్థిక పోటీలో ఎన్​విడియా చిప్‌లకు ఉన్న ప్రాధాన్యం ఆయన దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఎన్విడియా బోర్డుతో చర్చలు జరిపే బాధ్యత అప్పగించారు. వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌, ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ సహా పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంపై చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఆయనకు రెండో అవకాశం ఇవ్వడం అందరికీ ప్రయోజనకరమని వారిని ఒప్పించారు ట్రంప్‌ కూడా వ్యక్తిగతంగా బోర్డు సభ్యులతో మాట్లాడి అమెరికా ఏఐ ఆశయాలకు జెన్సన్‌ నాయకత్వం అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

జెన్సన్ హువాంగ్ పునర్నియామకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఆయన్ని మళ్లీ సీఈవోగా నియమించాలన్న ఎన్విడియా బోర్డు నిర్ణయం సరైందేనని అన్నారు. ఆ సంస్థ విజయానికి, శ్రేయస్సుకు మాత్రమే కాకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతికి కూడా జెన్సెన్ నాయకత్వం ఎంతో అవసరమని తన ట్రూత్ సోషల్​లో పోస్టు చేశారు.

'జెన్సెన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించాలని బోర్డు డైరెక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తిరిగి ఎన్విడియాలో చేరడం వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉంటుందని భావించడానికి అమెరికా ప్రభుత్వం వద్ద ఎలాంటి కారణం లేదు.

అలాగే ఆయన చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారనేదానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. వ్యక్తిగతంగా నాకు జెన్సెన్‌తో పరిచయం ఉంది. ఆయన గొప్ప దేశభక్తుడు. ఈ సందర్భంగా జెన్సెన్‌కు, ఎన్​విడియా బోర్డుకు, అమెరికా ప్రజలందరికీ అభినందనలు' అని ట్రంప్ ట్రూత్ సోషల్​లో రాసుకొచ్చారు.

ఎన్విడియా సీఈవోగా జెన్సన్‌ పునర్నియామకంతో పెట్టుబడి దారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఆ సంస్థలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. దీంతో ఒక్క రోజులోనే ఆ సంస్థ షేర్ల విలువ 1 ట్రిలియన్‌ డాలర్లమేర లాభపడింది.

దీంతో ఆ సంస్థ మొత్తం సంపద విలువ 3.98 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారీగా లాభపడ్డారు. ఎన్విడియాలో ఆయనకు గరిష్ఠంగా 3.70 లక్షల షేర్లు ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకుంటే.. ట్రంప్‌ షేర్ల విలువ ఒక్క రోజులోనే 15 మిలియన్‌ డాలర్లు పెరగొచ్చని అంచనా. ఈ ఉత్సాహంలో ట్రంప్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై జరిగిన దాడి ఫొటోను మార్ఫింగ్‌ చేసి విచిత్రమైన పోస్ట్ పెట్టారు.

జెన్సన్‌కు కూడా అనూహ్య లాభాలు వచ్చాయి. ఆయన వాటాషేర్లు అమెరికా మార్కెట్‌ ముగిసే సమయానికి కేవలం ఒక్క రోజు వ్యవధిలో 34 బిలియన్‌ డాలర్ల లాభాలను తెచ్చిపెట్టాయి.

కాగా ఎన్విడియాలో జెన్సన్ హువాంగ్ రెండో ఇన్నింగ్స్ అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా నిఘా వ్యవహారంపై ఎన్విడియా స్వతంత్ర బోర్డు కమిటీ ఇప్పటికే ఆయనపై దర్యాప్తు కొనసాగిస్తోంది. అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ , న్యాయశాఖ విచారణలు కూడా కొనసాగుతున్నాయి.

చిప్‌ల ఎగుమతులు, చైనాతో వ్యాపార సంబంధాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఎన్​విడియా కొత్తగా జాతీయ భద్రత, ఎగుమతి నియంత్రణ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. సంస్థలో తొలిసారిగా చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్‌ నియామకానికి చర్యలు చేపట్టింది.

డిసెంబరు 1న అమెరికా ప్రతినిధుల సభకు చెందిన మూడు కమిటీల ముందు, డిసెంబరు 3న సెనేట్‌ బ్యాంకింగ్‌ కమిటీ ముందు జెన్సన్‌ విచారణకు హాజరుకావాల్సి ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్