Burning topic: ఫ్లై దుబాయ్ ఘటనతో మారిన ఇజ్రాయెల్ ఎన్నికల సీన్!

Burning topic: అక్టోబర్ 27న ఇజ్రాయెల్ పార్లమెంటు ఎన్నికలు. ప్రధాని నెతన్యాహుకు ఎదురుగాలి వీస్తున్న తరుణంలో ఫ్లై దుబాయ్ ఘటన రాజకీయ సమీకరణాలను మారుస్తుందా?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Oct 2026 7:23 AM IST
Burning topic
X

Burning topic: ఫ్లై దుబాయ్ ఘటనతో మారిన ఇజ్రాయెల్ ఎన్నికల సీన్!

Burning topic: ఇజ్రాయెల్ మధ్య ప్రాచ్యంలోని ఒక చిన్న దేశం.ఇజ్రాయెల్ జనాభా కోటికి మించదు. ఇజ్రాయెల్ చుట్టూ ఎటు చూసినా అన్నీ ఇస్లామిక్ దేశాలే. వాటి మధ్యలో యూదుల ప్రాబల్యం ఉన్న ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్ కనిపిస్తుంటుంది.

ఒకప్పుడు ఆధునిక వ్యవసాయానికి ప్రతీకగా ఇజ్రాయెల్ ను అందరూ గొప్పగా చెప్పుకునే వారు.నీటి వసతి లేని రాతి నేలలలో ఇజ్రాయెల్ అద్భుతంగా వ్యవసాయం యావత్ ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. వ్యవసాయరంగంలో ఇజ్రాయెల్ సాధించిన విజయాలు చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు.

అయితే ఇజ్రాయెల్ లో మరో కోణం కూడా ఉంది. 2023 అక్టోబరు ఏడో తేదీ వరకు ఇజ్రాయెల్ లో ఉన్న ఈ అద్భుత శక్తి గురించి ప్రపంచానికి తెలియదు. 2023 అక్టోబరు ఏడో తేదీను ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాద సంస్థ రాకెట్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో హమాస్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు మొదలెట్టింది.ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచానికి ఒక సరికొత్త ఇజ్రాయెల్ పరిచయం అయింది. ఆధునిక యుద్ద తంత్రంలో ఆరితేరిన ఇజ్రాయెల్ ను యావత్ ప్రపంచం చూసింది.అలాంటి ఇజ్రాయెల్ లో త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబరు 27న ఈ ఎన్నికలు జరగబోతున్నాయి.

అంటే ఎన్నికలకు మరికొన్ని వారాలే గడువుంది. కాగా ఇజ్రాయెల్ పార్లమెంటులో మొత్తం స్థానాల సంఖ్య 120. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 61 సీట్లు. ఈసారి ఎన్నికల్లో ఎప్పటిలాగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. కాగా నెతన్యాహు ప్రస్తుతం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా నెతన్యాహుకు ఎదురుగాలి వీస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు.

పాలస్తీనా లేదా ఆ దేశం తరపున పోరాటం చేస్తున్న హమాస్ పై సుదీర్ఘ కాలం యుద్దం చేయడం ఇజ్రాయెల్ పౌరులకు నచ్చలేదన్నది నెతన్యాహుపై వ్యతిరేకతకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మును హమాస్ పై యుద్ధానికే ఖర్చు పెట్టారన్నది సగటు ఇజ్రాయిలీల ప్రధాన ఆరోపణ. అంతేకాదు ఇప్పటికీ యుద్ధాన్ని కొనసాగించడం సామాన్య ప్రజలకు మింగడు పడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కాగా ఎన్నికలు తరుముకువస్తున్న సందర్భంగా కొన్ని వారాల కిందట స్వతంత్ర సంస్థలు సర్వే నిర్వహించాయి. ఎన్నికలు జరిగితే ఏ పార్టీ లేదా కూటమి విజేతగా నిలుస్తుందన్న అంశంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి. ఈ సర్వేలో అందరూ నివ్వెరపోయే అనేక అంశాలు వెలుగుచూశాయి. నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్ పార్టీ కూటమి 61 సీట్ల మెజారిటీకి దూరంగా ఉంది.లికుడ్ పార్టీ కూటమి కి 50 నుంచి 54 సీట్ల వరకు రావచ్చని సర్వే ఫలితాలు తేల్చి చెప్పాయి.

ఈ నేపథ్యంలో ఫ్లై దుబాయ్ ఘటన ఘటన సంభవించింది. ఈ విమానంలో మొత్తం 180 మంది ప్రయాణీకులున్నారు. అయితే దాదాపు 170 మంది వరకు ఇజ్రాయెల్ దేశస్తులే అంటున్నారు. కాక్ పిట్ లో ఇద్దరు పైలెట్ల మధ్య జరిగిన కత్తిపోటు ఘటన .ఫ్లై దుబాయ్ ఎపిసోడ్ లో కీలకంగా మారింది. కాగా ఫ్లై దుబాయ్ ఘటనను జిహాదీ ఉగ్రవాద దాడి ప్రయత్నంగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ అభివర్ణించారు. కత్తిపోట్ల ఘటనలో గాయపడినప్పటికీ ..డోర్ తెరచి ప్రయాణీకులకు సహాయం చేసిన భారతీయ పైలెట్ స్మిత్ మచ్చర్ ను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసించారు.

ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్ ఎన్నికలపై ఫ్లై దుబాయ్ ఘటన ప్రభావం ఎంత ? ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఇదే హాట్ టాపిక్ అయింది. ఫై దుబాయ్ ఘటన కు సంబంధించిన సమాచారం అందిన వెంటనే తమ దేశస్తులను రక్షించడానికి యుద్ధ విమానాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పంపించిన సంగతి తెలిసిందే.

అంతేకాదు ఘటనలో గాయపడ్డవారిని పరామర్శించడం, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించడం వంటి చర్యలతో ఇజ్రాయెల్ రక్షకుడు అంటూ ఇప్పటికే ఉన్న ఇమేజ్ ను ప్రధాని నెతన్యాహు మరింతగా పెంచుకున్నారని లికుడ్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు ఫై దుబాయ్ విమాన ఘటన కు కొన్ని రోజుల ముందు ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ముందు శత్రువులు మనపై దాడులు చేయవచ్చని దేశ ప్రజలను ఆయన హెచ్చరించారు.దీంతో ఫై దుబాయ్ విమాన ఘటన ను సదరు హెచ్చరికలకు లింక్ పెట్టి లికుడ్ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు నిజమయ్యాయంటూ ప్రజలను ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

కాగా ఇప్పటికిప్పుడు చూస్తే ఫ్లై దుబాయ్ ఘటన నెతన్యాహుకు అలాగే ఆయన నాయకత్వంలోని లికుడ్ పార్టీకి కొంతమేర రాజకీయంగా అనుకూలంగా మారే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల ప్రచారంలో ఇదే కీలకాంశమైతే తప్పకుండా నెతన్యాహుకు లాభం జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఫలితంగా మెజారిటీ ఇజ్రాయిలీలు నెతన్యాహు నాయకత్వం వైపు మొగ్గు చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భద్రత అంశం మరింతగా జనంలోకి చొచ్చుకు వెళితే నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్ పార్టీ కూటమికి దాదాపు 58 సీట్లు దక్కవచ్చన్నది ఒక అంచనా.

కాగా ఫ్లై దుబాయ్ ఘటనను ప్రతిపక్ష శిబిరం మరో కోణంలో చూస్తోంది. యూయిర్ లాపిడ్ వంటి ప్రతిపక్ష నేతలు ఇందులో మరో కోణాన్ని చూస్తున్నారు. మూడేళ్ల కిందటి అక్టోబరు ఏడో తేదీ నాటి వైఫల్యాలను ఫ్లై దుబాయ్ ఘటన గుర్తుకు తెస్తోందని అంటున్నారు. ఫ్లై దుబాయ్ ఘటన లో నెతన్యాహు ప్రభుత్వం చేసిందేమీ లేదంటున్నారు.

సాధారణ ప్రయాణీకులే జోక్యం చేసుకుని తమ ప్రాణాలను కాపాడుకున్నారని యూయిర్ లాపిడ్ ప్రచారం చేస్తున్నారు.అంతిమంగా ప్రభుత్వ భద్రతా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష శిబిరం విమర్శలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్న ప్రశ్న కూడా తలెత్తింది.

మరోవైపు ప్రతిపక్ష శిబిరం పరిస్థితి కూడా సంత్రుప్తికరంగా లేదు. ప్రతిపక్ష శిబిరం కూడా మేజిక్ ఫిగర్ 61 సీట్లకు దూరంగా ఉందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే రెండు శిబిరాల్లో ఏదీ మెజారిటీ సాధించలేకపోతే రాజకీయ ప్రతిష్టంభన కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.చివరకు ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధానిగా నెతన్యాహు కొనసాగే అవకాశాలున్నాయి.

మొత్తంగా చూస్తే ఫ్లై దుబాయ్ ఘటన నెతన్యాహు ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా మేలు చేసే అవకాశం ఉంది. అయితే మొత్తంగా చూస్తే పార్లమెంటు ఎన్నికల ఫలితాలను నిర్ణయించే స్థాయిలో ఫ్లై దుబాయ్ ఘటన ప్రభావం ఉంటుందా అనేది తెరమీదకు వచ్చిన ప్రశ్న.ఇజ్రాయెల్ ఓటర్లు కేవలం భద్రతకే ప్రాధాన్యం ఇవ్వరు. భద్రతతో పాటు యుద్ధం,ఆర్థిక పరిస్థితి, నాయకత్వంపై విశ్వసనీయత వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అక్టోబరు 27న వీటి ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

వాస్తవానికి 1948 కి ముందు ప్రపంచపటంపై ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. 1948 మే 14న ప్రపంచపటంపై ఇజ్రాయెల్ పేరుతో ఒక కొత్త దేశం ఆవిర్భవించింది. కాగా ఈ 70 ఏళ్ల కాలంలో ఇజ్రాయెల్ అత్యంత అధునాతన ఆయుధ సంపత్తిని స్వంతం చేసుకుంది. ఇజ్రాయెల్ ఆవిర్బావం నుంచి ఆయుధ సంపత్తిని పోగేసుకోవడంపైనే దృష్టి పెట్టింది.

ఇజ్రాయెల్ చుట్టూ ఇస్లామిక్ దేశాలు ఉండటం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఎప్పుడు ఏ ఇస్లామిక్ దేశం దాడి చేసినా, ప్రతిదాడి చేయడానికి సర్వ సన్నద్దంగా ఇజ్రాయెల్ ఉండేది. ఆయుధ సంపత్తి విషయంలో ఇజ్రాయెల్ ఈ రేంజ్ లో బలపడటం మిగతా దేశాలకు మింగుడపడని పరిణామమే. అంతిమంగా ప్రపంచపటంపై ఇతర దేశాలను భయపెట్టే దేశం గా ఇజ్రాయెల్ ఆవిర్బవించిందని రక్షణ రంగ నిపుణులు అంటుంటారు.

ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి మరో విశేషం ఉంది. ఫలానా దేశం తమకు ప్రత్యర్థి అని ఇజ్రాయెల్ ఒకసారి డిసైడ్ అయితే , సదరు ప్రత్యర్థి దేశం అంతు చూసేవరకు వదలిపెట్టదు.ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక యుద్దతంత్రాన్ని ఇజ్రాయెల్ ఔపోసన పట్టింది. ఈ విషయంలో యావత్ ప్రపంచానికి లీడర్ గా ఇజ్రాయెల్ నిలిచింది.అంతేకాదు నిత్యజీవితంలో వాడే సాధారణ పరికరాలను విధ్వంసానికి ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటోంది. కొంతకాలం కిందట పేజర్లు, వాకీటాకీలతో ప్రత్యర్థులపై ఇజ్రాయెల్ విరుచుకుపడటమే ఇందుకు ఉదాహరణ.

కాగా 2023 నాటి హమాస్ మెరుపు దాడులకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిస్పందించింది. హమాస్ ను అంతం చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగా పాలస్తీనా పై ప్రతీకార దాడులను ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా పాలస్తీనాలో కీలక ప్రాంతమైన గాజాను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. దీంతో మూడేళ్ల కిందటి వరకు జనంతో కళకళలాడిన గాజా ప్రాంతం ఇజ్రాయెల్ దాడుల కారణంగా వల్లకాడులా తయారైంది.

హమాస్ మిలిటెంట్ల పై పోరులో అనేకసార్లు ఇజ్రాయెల్ దే పైచేయి అయింది. హమాస్ టాప్ లీడర్ ను మహమ్మద్ సిన్వర్ సహా అనేక మంది ఇతర కమాండర్లను ఇజ్రాయెల్ హతమార్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే, హమాస్ ఉగ్రవాద సంస్థ వెన్నెముక విరిచేసింది. హమాస్ నే కాదు పాలస్తీనా అనుకూల మిలిటెంట్ సంస్థ అయిన హెజ్ బొల్లా నెట్ వర్క్ ను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అంతేకాదు ఎక్కడో వందల కిలోమీటర్ల దూరాన బంకర్లలో దాగి ఉన్న హెజ్ బొల్లా టాప్ లీడర్లను కూడా ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయి.ఏమైనా ఆధునిక యుద్ద తంత్రంలో ఇజ్రాయెల్ ఆరితేరింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్